DGP met Reventh Reddy : రేవంత్ రెడ్డి ని కలిసిన డీజీపీ అంజనీ కుమార్‌.

6tv projects 12 DGP met Reventh Reddy : రేవంత్ రెడ్డి ని కలిసిన డీజీపీ అంజనీ కుమార్‌.

DGP met Reventh Reddy : రేవంత్ రెడ్డి ని కలిసిన డీజీపీ అంజనీ కుమార్‌.

తెలంగాణని గత దశాబ్డ కాలంగా పరిపాలిస్తున్న భారత రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు ముగింపు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు పూర్తయినంత వరకు కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో చాలా జిల్లాలలో గెలుపుని సొంతం చేసుకుంది.


ఇక తిరుగులేని గెలుపు సొంతం చేసుకున్న కాంగ్రేస్ నుంచి తెలంగాణ రెండవ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కొడంగల్ మరియు కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేసారు.
కొడంగల్ అయన సొంత నియోజకవర్గం, ఈ రెండు స్థానాలలో రేవంత్ రెడ్డి అత్యధిక స్థానాల్లో నిలిచారు.
ప్రొటొకాల్స్ ప్రకారం డిజిపి అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలియజేసారు.


పూర్తి ఎన్నికల ఫలితాలు ఇంకా రానప్పటికీ 66 సీట్ల మెజారిటీలో ఉన్న కాంగ్రేస్ గెలుపుకి దరిదాపులలోకి కూడా ఆ పార్టీ వచ్చే అవకాశం లేనందున ఇక కాంగ్రేస్ ని విజయం వరించిందనే రాష్ట్రం నమ్ముతోంది. PCC చీఫ్ అయిన రేవంత్ రెడ్డి సారథ్యంలోనే కాంగ్రేస్ గెలిచింది అనేది అందరికి తెలిసిన వాస్తవం, కాబట్టి ఇక ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాద్యతలు చేపట్టబోయేది రేవంత్ రెడ్డి కనుక డీజీపీ అంజనీ కుమార్ అధికారికంగా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.


ప్రస్తుతం కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంది.

Leave a Comment