Danush: బిచ్చగాడిగా ధనుష్.. ఆసక్తి పెంచుతున్న కుబేర లుక్‌

e3ee692b 3283 41fd 9535 96719a3579f8 2 Danush: బిచ్చగాడిగా ధనుష్.. ఆసక్తి పెంచుతున్న కుబేర లుక్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ (Danush) సినిమా అంటే ఆడియన్స్ లో వైబ్రేషన్స్ వేరే లెవెల్ ఓ ఉంటాయి. తమిళం, తెలుగు అన్న వేరియేషన్ లేకుండా ధనుష్ మూవీ కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధనుష్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. డబ్బింగ్‌ మూవీస్ తో తెలుగు ఆడియన్స్‌ని దగ్గరైన ధనుష్‌ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఓ తెలుగు మూవీకి సైన్ చేశాడు. ఎట్టకేలకు టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూనే మరో వైపు తెలుగు డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబోలో ఓ మూవీ చేస్తున్నాడు ధనుష్. పాన్‌ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ మూవీ అనౌన్స్‎మెంట్‎తో ఇండస్ట్రీలో ఓ రేంజ్‎లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక స్టార్‌‎కాస్ట్ అనౌన్స్‎మెంట్‎తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు కింగ్‌ నాగార్జున (Nagarjuna)కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అంవుతోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ టైలిల్ అనౌన్స్‎మెంట్‎తో పాటు ధనుష్ ఫస్ట్ లుక్ ను చూపించి అందరిలో ఆసక్తిని పెంచారు.

బిచ్చగాడిగా ధనుష్

be6b6845 924e 4024 9210 ae1d2c3fc3d8 Danush: బిచ్చగాడిగా ధనుష్.. ఆసక్తి పెంచుతున్న కుబేర లుక్‌

ధనుష్ (Danush),శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబోలో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌పైకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ధనుష్‌ లుక్‌తో పాటు మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ ‘కుబేర'(Kubera) అని అధికారికంగా ఫైనల్ చేశారు మేకర్స్. ఈ టైటిల్‌ తో పాటు ధనుష్ లుక్‌ ని రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే సినిమా టైటిల్ కి ధనుష్ లుక్ కి అసలు సంబంధమే లేదు. దీంతో ఈ మూవీ కథేంటి అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టైటిల్‌ చూస్తే కుబేర అని ఉంది, కానీ ధనుష్‌ లుక్‌ మాత్రం బిచ్చగాడిగా ఉంది.

ధనుష్ జోడీగా రష్మిక :

అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి.(Amigos creations pvt ltd),శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి(Sri venkateswara) బ్యానర్ పై సునీల్ నారంగ్(Sunil Narang),రామ్ మోహన్ రావు(Ram Mohan Rao) ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. జనవరిలో ఈ మూవీ షూట్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ధనుష్ కు జోడీగా రష్మిక మందన్నా (Rashmika Mandanna)కనిపించనుంది.

పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న కుబేర (Kubera)కు దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri Prasad) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడలో తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే మూవీ సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ అనౌన్స్ చేయనున్నారు. ‘ఫిదా’ (Fida),’లవ్ స్టోరీ’ (Love Story) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ డైనమిక్ స్టార్ హీరో ధనుష్ హీరో కావడంతో ఓ రేంజ్ ఎక్స్‎పెక్టేషన్స్ ఉన్నాయి.

Leave a Comment