MS Dhoni: ధోని బరువు తగ్గమని చెప్పింది ఎవరికీ..

Dhoni told no one to lose weight.. Did that player follow Dhoni's advice?

MS Dhoni: ధోని బరువు తగ్గమని చెప్పింది ఎవరికీ..

మహీంద్రసింగ్ ధోని, ఈ పేరు ఎంతో మంది క్రికెటర్లకు ప్రేరణ, మహి ఆట తీరును చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

ఇక గ్రౌండ్ లోకి ధోని దిగాడంటే ధనాధన్ అన్నట్టు ఉంటుంది. ధోని కొట్టే షాట్లకు ఫ్లాట్ అవ్వని క్రికెట్ అభిమానులు ఉండరు.

మహి కొట్టే హెలికాఫ్టర్ షాట్స్ కి ఎంత మంది ఫాన్స్ ఉన్నారని కౌంట్ చేయడం వీలు కాదు. ఇక ధోని కి కేవలం మన భారతీయులే కాదు పరాయి దేశం వారు కూడా ఫాన్స్ అయిపోయారు.

ఆ ఫాన్స్ లో క్రికెట్ వీక్షకులు మాత్రమే కాదు, క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇప్పడు అలాంటి క్రికెట్ ప్లేయర్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.

అతడు ఎవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహ్మద్ షాజాద్, కాస్త బొద్దుగా ఉండే ఈ ఆటగాడికి మహి అన్నా, మహీ ఆట అన్నా మహా పిచ్చి. ఈ విషయాన్నీ స్వయంగా ఆ జట్టు సారధి అస్గర్‌ అఫ్గానే వెల్లడించాడు.

ఇది చాలా పాత సంగతే కానీ చాలా సరదా అయిన సంగతి, 2018 ఆసియా కప్‌లో భారత్‌-అఫ్గానిస్థాన్‌ జట్ల కు మధ్య మ్యాచ్‌ జరిగింది.

రెండు జట్లు కూడా ఆ మ్యాచ్ లో గెలుపును సొంతం చేసుకునేందుకు విపరీతంగా పోరాడాయి. ఇద్దరి మధ్య దోబూచులాడింది విజయం ఎవ్వరికి దక్కకుండా టై అయింది. ఆ సమయంలో కాస్త ఖాళి దొరకడంతో ఆఫ్ఘన్ జట్టు కెప్టెన్ అస్గర్‌ కి మన మహికి మధ్య చిట్ చాట్ మొదలైంది.

అప్పుడు చెప్పాడట అస్గర్ మహ్మద్ షాజాద్ గురించి మహికి, మా షాజాద్ కి మీరన్నా, మీ ఆట తీరాన్న చాలా ఇష్టం అని చెప్పాడట.

అందుకు ధోని చిన్న చిరునవ్వు నవ్వి, షాజాద్ కి సంబంధించి ఒక సలహా ఇచ్చాడట, షాజాద్‌కు పెద్ద పొట్ట ఉంది, అతను గనుక 20 కేజీల బరువు తగ్గ గలిగితే ఐపీఎల్‌కి చేస్తానని మహి మాట ఇచ్చాడట.

తగ్గడం మాట ఏమోకానీ, షాజాద్ ఆ సీరిస్ అనంతరం తిరిగి స్వదేశం వెళ్ళాక మరో ఐదు కేజీల బరువు పెరిగాడట. ధోని ఎంత అద్భుతమైన ఆటగాడో అంతే అద్భుతమైన వ్యక్తితం కలిగిన మనిషి అని చెప్పుకొచ్చాడు అస్గర్.

ధోని ని పరాయిదేశపు ఆటగాడు ఇలా పొగడ్తల్లో ముంచెత్తుతుంటే అతని ఫాన్స్ ఆనందంలో మునిగి తెలియాడుతున్నారు.

Leave a Comment