రేపటి నుండి IPL సీజన్ 17 ప్రారంభం అవుతున్న వేళ ధోని CSK కి షాక్ ఇచ్చాడు. అయితే దీనికి కల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పడు ధోని కి బదులు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ భాధ్యతలు తీసుకున్నాడు. రుతురాజ్ 2019 నుండి చెన్నై టీమ్ కి ఆడుతున్నాడు. అంతే కాదు ఆ జట్టు లో ఒక కీలక ఆటగాడు గా ఎదిగాడు. ఇప్పటి వరకు CSK తాపున మొత్తం 52 మ్యాచ్ లు కుడా ఆడాడు. ఒకప్పుడు ఓ సీజన్ లో 635 రన్స్ చెయ్యడమే కాకుండా ఆరెంజ్ క్యాప్ కుడా అందుకున్నాడు.
IPL ఫస్ట్ సీజన్ నుండి ధోని CSK టీమ్ కి నాయకత్వం వహిస్తున్నాడు. 2013 లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల తరుణం లో ఫ్రాన్చైజీ ని రద్దు చేసిన మిగిలిన అన్ని సీజన్స్ కి ధోనీ యే నాయకత్వంతో నే మిగిలిన టీమ్ లతో ఆడాడు. IPL 2022 సంవత్సరం లో జడేజా కి సారధి గా భాద్యతలు ఇచ్చినప్పటికీ, తిరిగి 8 మ్యాచ్ ల అనంతరం తిరిగి ధోనీ యే భాద్యతలు నిర్వహించాడు. ఇప్పటి వరకు ధోని CSK టీమ్ తరపున 212 మ్యాచ్ లకు సారధి గా నిలిచాడు. ఇప్పుడు కొత్త భాద్యతలు చేపట్టిన రుతురాజ్ నాయకత్వం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎలా అలరిస్తాడా అని CSK అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.