కొబ్బరి కాయ కొట్టినపుడు ఇలా జరిగిందా ! వెంటనే ఇలా చెయ్యండి !

WhatsApp Image 2024 03 21 at 11.16.28 AM కొబ్బరి కాయ కొట్టినపుడు ఇలా జరిగిందా ! వెంటనే ఇలా చెయ్యండి !

ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి అందులో మన హిందూ మతానికి సంబంధించిన సాంస్కృతి ఒకటి కొబ్బరి అనేది మన హిందూ మతం కి ఎంతో పవిత్రమైనది దానికి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాం. కొబ్బరికాయకి స్వచ్ఛత సంతాన ఉత్పత్తి కి, దేవుని ఆశీర్వాదాలు అందుతాయని నమ్మకం. మనం ఆలయానికి వెళ్లిన ఇంట్లో దైవకార్యం చేసుకున్నా కచ్చితంగా కొబ్బరికాయను వాడతాం. అంతేకాదు దీనిని మనం ప్రసాదంగా కూడా పంచి పెడుతూ ఉంటాం.

కొబ్బరికాయ ను ప్రధానంగా మన ఇంట్లో ఏం వేడుకలు చేసుకున్నా నైవేద్యాలకు తప్పనిసరిగా ఉపయోగిస్తాం. కొబ్బరికాయ అనేది శుభ సూచకంగాను ఆధ్యాత్మికతకు స్వచ్ఛత గాను చూస్తాం.అగ్ని పురాణంలోనూ బ్రహ్మపురాణాల్లోనూ కొబ్బరికాయ యొక్క ప్రాముఖ్యతను చెప్పబడింది. ఒకప్పుడు కొబ్బరికాయ చెట్టుని ఔషధ మొక్కగానే కాకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉండడానికి ఆహ్లాదంగా ఉండడానికి ప్రశాంత వాతావరణం ఏర్పడడం కోసం కొబ్బరికాయ చెట్లు నాటేవారు. ఇళ్లల్లో కొబ్బరి చెట్లు నాటడం వల్ల సంపద కూడా అలాగే పెరుగుతుందని పండితులు చెప్తున్నారు.

హిందువులకు కొబ్బరికాయ అనేది ఒక ఆరాధన అవసరంగా చూస్తాం దానికి ఎంతో ప్రాధాన్యతను కూడా ఇస్తాం. దేవుడికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించడం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు పొందవచ్చని పండితులు చెప్తున్నారు. మహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు మానవుల శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని కొబ్బరి చెట్టుని , కామదేవుని భూలోకానికి పంపించినట్టు పురాణాల్లో చెప్పబడింది.

పండితులు చెప్తున్న ప్రకారం కొబ్బరికాయలో వివిధ భాగాలను దేవుళ్లను అలాగే దేవతలుగాను హిందువులు ఆరాధిస్తారు. కొబ్బరికాయలో ఉండే తెల్ల గుజ్జుని పార్వతి దేవి గాను కాయలు లోపల నీరుని పవిత్రమైన గంగా నదితోను పోలుస్తారు. అలాగే కొబ్బరికాయ బయట ఉంటే పెంకుని అంటే గోధుమ కవచాన్ని కార్తికేయడు గా ఆరాధిస్తారు. దేవుని ముందు కొబ్బరికాయని కొట్టడం అనేది ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మనం చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఇది హిందువులందరికీ చాలా ప్రాధాన్యమైన వస్తువు. అలాగే కొబ్బరికాయ చిప్పను అహంకారానికి చిహ్నంగా హిందువులు భావిస్తారు.

అందుకనే మన ఇంట్లో దైవ కార్యాలు జరిగినపుడు శుభకార్యాలు జరిగినపుడు కొబ్బరికాయని కొట్టడం అనేది అహంకారం పోగొట్టుకోవడం అనే దానికి సంకేతంగా చెప్పవచ్చు. హిందువులు తమ పూజా కార్యక్రమాలలో కొబ్బరికాయని కొట్టి ఆ నీటిని సమర్పించడం వల్ల తనను తాను శుద్ధి చేసుకుని శుభ్రపరచుకోవడం అని అర్థం.

అందుకనే కొబ్బరికాయని చాలా ప్రాధాన్యత ఉన్న వస్తువుగా హిందువులు చూస్తారు. ఒక్కసారి పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కొబ్బరికాయ కుళ్ళినట్లయితే దాన్ని అశుభంగా చూస్తారు హిందువులు. ఏదో చెడు జరగబోతుందని దానికి సంకేతం గానే కొబ్బరికాయ కుళ్ళిందని భావిస్తారు. కానీ కొబ్బరికాయ అలా కూలినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మనకు జరగబోయే కీడు దీని ద్వారా పోయిందని పండితులు చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల తెల్లని గుజ్జు లాంటి పదార్థం కనిపిస్తుంది దాన్ని పువ్వు అంటారు అది రావడం వల్ల మనకు మంచి జరగబోతుందని దానికి సంకేతంగా భావించాలని పండితులు చెప్తున్నారు

Leave a Comment