DiL Raju: పిచ్చిగా రాస్తే వదిలిపెట్టను మీడియాపై దిల్ రాజు మరోసారి ఫైర్.

Dil Raju is once again under fire on the media.

DiL Raju: సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర సినిమాల హవా షురూ అవుతుంది. ఈ ఏడు కూడా బాక్సాఫీస్ బరిలో పలు సినిమాలు పోటీపడుతున్నాయి.

ఈ క్రమంలో థియేటర్ల విషయంలో ప్రారంభంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఏడు సంక్రాంతికి ప్రారంభంలో ఐదు సినిమాలో ఉండగా థియేటర్లు దొరకని కారణంగా పలు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు.

ఈ క్రమంలో రవితేజ (Ravi Teja) నటించిన ఈగల్ (Eagle)సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు

కావడంతో ఏ ఒక్క నిర్మాతకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో నిర్మాతల సంఘం చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కొన్ని వెబ్‎సైట్స్ టాలీవుడు నిర్మాతను కార్నర్ చేస్తూ ఆయనపై నెగెటివ్ వార్తలు రాస్తున్నాయి.

ఇదే విషయంపై ముందుగానే దిల్ రాజు (Dil raju) హెచ్చరించారు. అయినా తమ విధానాన్ని మార్చుకోకపోవడంతో తాజాగా మరోసారి దిల్ రాజు సదరు వెబ్ సైట్స్ పై మండిపడ్డారు.

తనపై పిచ్చిపిచ్చిగా వార్తలు రాస్తే వదిలిపెట్టేదిలేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dil raju strong warning to media : మీడియాకు దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

“తనపై తప్పుడు న్యూస్ రాస్తే తాట తీస్తా” అంటూ ప్రొడ్యూజర్ దిల్ రాజు (Dil Raju) ఫైరైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి (Sankranthi)సందర్భంగా ప్రతిసారి ఎదురయ్యే థియేటర్ల ఇష్యూలోకి తనని లాగడంపై దిల్ రాజు మండిపడ్డారు.

నెట్టింట్లో గత రెండు మూడు రోజులుగా థియేటర్ల కేటాయింపు విషయంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దిల్ రాజు వీడియో లేటెస్టుగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

కొంతమంది మీడియా రిపోర్టర్లపై దిల్ రాజు అరవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఓ వెబ్ సైట్ (Website) రిపోర్టర్ ముందు నిలుచుని ” ఏమనుకుంటున్నావ్..

నా గురించి పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను గుర్తుపెట్టుకో “అంటూ వేలు చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన పక్కనే ఉన్న కొంతమంది దిల్ రాజును కూల్ చేసే ప్రయత్నం చేశారు.

కానీ వారిపైన ఆయన సీరియస్ అయ్యారు. ఈ వీడియోను రికార్డ్ చేస్తున్న కెమెరామెన్ మీద అరిచారు. దంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే ఈ విషయంలో అసలు నిర్మాత దిల్ రాజు తప్పేంలేదని కావాలని ఓ వెబ్‎సైట్ ఆయన్ను టార్గెట్ చేసి నెగెటివ్ వార్తలు రాస్తోందని మరికొంత మంది నెటిజన్లు ఇన్‎బాక్స్‎లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ల విషయంలో సమస్య ఉన్నది వాస్తవమే అయినప్పటికీ దానికి దిల్ రాజును కారణం చేయడం ఏంటని ప్రశ్నించారు.

They willingly targeted me : నన్ను కావాలనే టార్గెట్ చేశారు

ఈ సంక్రాంతికి సినిమాల రష్ చాలా ఉంది. 30 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna)ల సినిమాలకే సరిగ్గా థియేటర్లు దొరకలేదని దిల్ రాజు(Dil Raju) తెలిపారు.

ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నా గురించి సానుకూలంగా మాట్లాడితే దానిని కూడా నెగెటివ్ గా మార్చి కొన్ని వెబ్‌సైట్లు చూపించాయని దిల్ రాజు మండిపడ్డారు.

వాళ్లకి కావాల్సిన పాయింట్లను మాత్రమే తీసుకొని నన్ను టార్గెట్ చేస్తూ ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతికి కార్నర్ చేస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఓ లెక్క ఇకనుంచి మరోలెక్క.

నాపై పిచ్చిపిచ్చిగా వార్తలు రాస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దిల్ రాజు. నన్ను వాడుకొని రేటింగ్ పెంచుకుందామని చూస్తే తాట తీస్తానంటూ ఫైర్ అయ్యారు.

తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో తనపై నెగెటివ్ వార్తలు రాస్తున్న సదరు రిపోర్టర్ కనిపించడంతో దిల్ రాజు అతడిని అక్కడే నిలబెట్టి వాయించేశారు.

ఇలాంటి వార్తలు మళ్లీ రాస్తే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు దిల్ రాజుపై చాలా వరకు ఈ రేంజ్‌లో ఫైర్ అవడం మాత్రం ఇదే తొలిసారి.

Leave a Comment