Krishna Vamshi : నేను చేసిన పెద్ద తప్పు అదే

dc Cover st7ic3nd5mj11eqa6muum6lv91 20170717223156.Medi Krishna Vamshi : నేను చేసిన పెద్ద తప్పు అదే

ఫ్యామిలి ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న పేరు
కృష్ణవంశీ (Krishna Vamsi). సరికొత్త కథలతో కొన్నేళ్లుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు ఈ లెజెండ్ డైరెక్టర్. కృష్ణ వంశి డైరెక్షన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఇండస్ట్రీకి అందించారు. ఆయన తీసిన చిత్రాలు ఇప్పుడు రిలీజై ఉంటే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవని అయన అభిమానులు అనుకుంటుంటారు .

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన శ్రీ ఆంజనేయం (Srianjaneyam), ఖడ్గం (Khadgam ) సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే సెన్సేషనల్ హిట్లుగా నిలిచేవని సినీ విశ్లేషకుల అభిప్రాయం. కృష్ణవంశీ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటారు. తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. రీసెంట్ గా ఓ నెటిజన్ ఇటీవల రిలీజైన హనుమాన్ (Hanuman ) మూవీ కన్నా శ్రీఆంజనేయం సినిమానే బాగుందని కామెంట్ చేశాడు. దానికి కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆ లవ్ ట్రాక్ జనాలకు నచ్చలేదు :

హనునన్ (Hanuman ) సినిమా రిలీజైనప్పటి నుంచి శ్రీఆంజనేయం సినిమాలోని కొన్ని సీన్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతగా లేని ఆ రోజుల్లోనే కృష్ణ వంశీ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారాని వార్తలు వినిపించాయి. శ్రీఆంజనేయం (Srianjaneyam)సినిమా అంతా బాగానే ఉంది కానీ నితిన్, ఛార్మి లవ్ ట్రాక్ జనాలను కాస్త ఇబ్బంది పెట్టింది. అందుకే సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ క్రమంలో అప్పట్లో నెటిజన్ కామెంట్ పై కృష్ణవంశీ స్పందిస్తూ…” ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు కాదు.. వారికి సినిమా నచ్చలేదంటే.. అందులో ఏదో కారణం ఉంటుంది. ఈ సినిమా రీచ్ సరిగ్గా అవ్వలేదు అంటే అందులో ఆడియన్స్ తప్పులేదు. నిజానికి వారి వల్లే సినిమాలు బాగుంటాయి” అని తెలిపారు.

తాజాగా కృష్ణవంశీ (Krishna Vamsi) ఫాలోవర్ ఒకరు మరోసారి శ్రీఆంజనేయం గురించి కామెంట్ చేశాడు.. సినిమా అంతా వేరే లెవల్ ఉంది.. కానీ నితిన్, చార్మీల రొమాంటిక్ పాటైన పూలు గుమ గుమ చేరనిని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు.. ఆ పాట పెట్టడానికి కారణం నేనే.. అది నేను చేసిన పెద్ద తప్పుగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి బాధ పడుతున్న అంటూ ట్వీట్ చేశారు. ఆ కామెంట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Leave a Comment