Director nag ashwin reveals Reason Behind Kalki 2898 AD Title : సలార్ (Salaar ) మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు ప్రభాస్ (Prabhas ). వరస ఫ్లాపులతో తీవ్ర అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్ లోనూ కొత్త ఊపు వచ్చింది. భారీ వసూళ్లను రాబట్టి ఈ మూవీ సెన్సేషనల్ హిట్ ను సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Sharukh Khan) నటించిన డంకి (Dunki ) సినిమాను కూడా పక్కకు నెట్టి దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో దుమ్ము దులిపింది సలార్. సలాడ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న
ప్రభాస్ ప్రస్తుతం మహానటి (Mahanati ) ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టైటిల్ తో త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అనేక డౌట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీకి కల్కి 2898 ఏడీ అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు తమ మెదడుకు పదునుపెట్టారు. ఎట్టకేలకు ఆ సీక్రెట్ ను రివీల్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
‘కల్కి 2898 ఏడీ’ స్టోరీ ఇదే :
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas) హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin ) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సినీ అభిమానులు మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ‘కల్కి 2898 ఏడీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.
టైటిల్ వెనుక స్టోరీని రివీల్ చేశాడు. ఈ మూవీ మహాభారతం కాలం నుండి స్టార్ట్ అయ్యి 2898తో పూర్తవుతుంది. గతంతో మొదలయ్యి భవిష్యత్తుతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాం. ‘కల్కి 2898 ఏడీ’ లో 6000 సంవత్సరాల కాలం మధ్య జరిగే స్టోరీని చూపించబోతున్నాం. అప్పటి రోజులకు తగినట్లుగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రతి సీన్ లో భారతీయ టేస్ట్ కనిపించేలా సినిమా తీశాం. ఇలాంటి స్టోరీ తోనే గతంలో బ్లేడ్ రన్నర్ (Blade Runner) అనే మూవీ రిలీజ్ అయింది. అయితే ఆ మూవీకి కల్కి కి అసలు పోలికలు ఉండవు. ఇది మాకు పెద్ద ఛాలెంజ్ గా అనిపించింది”.అని ఫైనల్‌గా నాగ్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు.
హాలీవుడ్ రేంజ్ లో సినిమా :
‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) నుండి మేకర్స్ ఇప్పటివరకు కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు. అన్ అఫీషియల్ గా ఈ సినిమా నుండి ఎన్ని పోస్టర్లు, ఫోటోలు బయటికి వచ్చినా అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది మాత్రం ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఈ సినిమాను మే 9న రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నహాలు చేస్తున్నారు.
హాలీవుడ్ ( Hollywood ) రేంజ్ లో సినిమా తీస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఈ సినిమాలో బాలీవుడ్ తారలు నటిస్తుండటంతో అందరి దృష్టి కల్కి పై పడింది. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ లు దీపికా పదుకొనె (Deepika Padukone ) , దిశా పటానీ ( Disha Patani ) నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan) , కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ( Kamal Haasan) లాంటి సీనియర్ నటులు కల్కిలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొత్తంగా 22 భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు మరెన్నో దేశీ, విదేశీ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. త్వరలోనే మేకర్స్ టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.