వాళ్ల కష్టం అర్థమైంది. గామిపై రాజమౌళి పోస్ట్

WhatsApp Image 2024 03 07 at 12.20.14 PM వాళ్ల కష్టం అర్థమైంది. గామిపై రాజమౌళి పోస్ట్

Director Rajamouli Post On Viswak Sen Gaami movie : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Viswak Sen)లేటెస్టుగా నటించిన మూవీ ‘గామి’ (Gaami). విద్యాధర్ (Vidhyadhar)ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయంఅవుతున్నాడు. మొన్నటి వరకు కమర్షియల్, మాస్ మూవీస్ తో అలరించిన విశ్వక్ సేన్.

ఈసారి ‘గామి’తో ప్రయోగాల బాటపడ్డాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచింది. విశ్వక్ సేన్ ఫస్ట్ టైం ఈ మూవీలో అఘోరగా కనిపించనున్నాడు. ఈ ట్రైలర్ పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ లిస్టులో దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి చేరారు. ‘గామి’ సినిమాపై తన ఇన్‎స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు . ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నాలుగేళ్ల కష్టం కనిపిస్తోంది :

” కఠోరమైన కృషి వుంటే అసాధ్యమైన కలలు సైతం సుసాధ్యం అవుతాయి. ‘గామి'(Gaami)కోసం డైరెక్టర్ విద్యాధర్ (Vidhyadhar), ప్రొడ్యూజర్ కార్తీక్ (Kartheek)ఎంత కష్టపడ్డారో నాకు చెప్పినప్పుడు అర్థమైంది. మూవీలోని విజువల్స్ ను బట్టి వారి నాలుగేళ్ల కష్టం తెలుస్తోంది. మార్చ్ 8 మూవీ రిలీజ్ సందర్భంగా టీమ్ కి నా తరఫున బెస్ట్ విషెస్ చెబుతున్నాను” అని తన ట్విట్టర్ లో పోస్ట్ షేర్ చేశారు.

కాంతారాని ఫాలో అవుతాం :

‘గామి’ (Gaami)మూవీ మార్చి 8న రిలీజ్ కాబోతోంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘గామి’ ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయకపోవడంపై హీరో విశ్వక్ సేన్ (Viswak Sen)ఈ మధ్యే మాట్లాడాడు.”రిషబ్ శెట్టి (Rishab Shetty)నటించిన కాంతారా (Kantara) మూవీ ఒక్క భాషలోనే విడుదలైంది.

అక్కడ ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ ను వసూళ్లతో షేక్ చేశారు. ఇప్పుడు ‘గామి’ విషయంలోనూ అదే ఫాలో అవుతాం. ఈ మూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా భాషల్లో రిలీజ్ చేస్తాము. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని విశ్వక్ తెలిపాడు.

మహేష్‎తో షూటింగ్ అప్పుడే :

రాజమౌళి (Rajamouli)తో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మహేశ్‌-రాజమౌళి కాంబినేషన్ లో ఎప్పుడో మూవీ రావాల్సి ఉంది. కానీ చాలా ఆలస్యం అయింది. వీరిద్దరి కాంబోలో మూవీ లేటుగా వస్తున్నా.. భరతీయ సినిమా చూడని సరికొత్త కంటెంట్‌తో వస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇంటర్నెట్ లో వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ‘టైటానిక్’ (Titanic), ‘అవతార్’ (Avatar) వంటి సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకదిగ్గజం జేమ్స్ కామెరూన్ (James Cameron) భారత్ వస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఆయనతో పాటు ‘ఇండియనా జోన్స్’ (Indiana Jones), ‘జురాసిక్ పార్క్’ (Jurassic Park)వంటి మూవీస్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన మరో దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg)సైతం వస్తున్నారని సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీగా తెరకెక్కించే ఉద్దేశంతోనే రాజమౌళి వారిని ఆహ్వానిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Leave a Comment