Diwali special movies : దీపావళికి తెలుగు స్టార్ హీరోలు రెస్ట్ తీసుకున్నారా, తెలుగు నాట అనువాద చిత్రాల ఆట,

104490108 Diwali special movies : దీపావళికి తెలుగు స్టార్ హీరోలు రెస్ట్ తీసుకున్నారా, తెలుగు నాట అనువాద చిత్రాల ఆట,

Diwali special movies : దీపావళికి తెలుగు స్టార్ హీరోలు రెస్ట్ తీసుకున్నారా.. తెలుగు నాట అనువాద చిత్రాల ఆట..

తెలుగువారి లోగిళ్ళలోకి వినాయకచవితి, దసరా తరువాత వచ్చే అతి పెద్ద పండుగ దీపావళి. అయితే దసరా సమయంలో తెలుగు నాట నందమూరి నటసింహం, మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ కూడా తమ సినిమాలను రిలీజ్ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అయితే దసరా పండుగ వీరి ఫాన్స్ కి నిజంగానే పెద్ద పండుగ అయింది. డబుల్ ధమాకా అన్నట్టు ఇద్దరు బ్లాక్ బస్టర్లు కొట్టేశారు. అయితే ఈ దీపావళికి మాత్రం తెలుగు ఇండస్ట్రీ నుండి ఏ స్టార్ హీరో కూడా తమ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేసుకోలేదు.

కాబట్టి అలా ఫ్రీగా ఉండిపోయిన స్పేస్ ను తెలుగు నుండి వస్తున్న చిన్న సినిమాలు, తమిళ్ నుండి వస్తున్నా స్టార్ హీరోలు చక్కగా వాడుకుంటున్నారు.

మరి అయితే ఈ దీపావళికి తెలుగు తెరపై సందడి చేయబోతున్న ఆ కొత్త సినిమా విశేషాలు ఏమిటో, అవి ఎవరెవరి సినిమాలో ఒక్కసారి చూద్దాం.

సూర్య తమ్ముడు కార్తీ అనే పేరు నుండి, హీరో కార్తీ అనే స్థాయికి చాలా త్వరగా ప్రమోట్ అయ్యాడు కార్తీ. అందుకు కారణం కార్తీకి చక్కగా తెలుగు మాట్లాడటం రావడం కూడా ఒక కారణం.

అది ఒక్కటి మాత్రమే కాదు, సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపెడుతూ, ఎక్కడా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకుంటున్నాడు.

అందుకే తమిళం తోపాటు తెలుగులో కూడా ఏక కాలంలో సినిమాలు విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. కార్తీ ఈ దీపావళికి తెలుగువారిని తన సినిమా జపాన్ తో పలుకరించనున్నాడు.

ఈ సినిమా కోసం కార్తీ ఒక డిఫరెంట్ స్టయిల్ లో మాట్లాడుతున్నాడు. ఇందులో కార్తీ ఒక గజదొంగ పాత్రను పోషిస్తున్నాడు. కార్తీకి జంటగా అను ఇమాన్యుల్ నటిస్తుంది.

జపాన్ ఈ సినిమాలో 200 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దొంగిలిస్తాడు. మరి పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అవి ఫలించాయా ? జపాన్ పట్టుబడ్డాడా లేక తప్పించుకున్నాడా అన్నది తెలియాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే.

రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు.

డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టిన లారెన్స్ తరువాతి కాలంలో నటుడయ్యారు, ఆతరువాత దర్శకు కూడా అయ్యారు. ఇక డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి మంచి హిట్లు అందుకున్న ఎస్.జె సూర్య తరువాతి కాలంలో నటుడిగా మారి బాగా బిజీ అయ్యారు.

ఇప్పుడు ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా జిగర్ తాండ డబుల్ ఎక్స్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాను దీపావళి కానుకగా తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

ఇక ఈ మధ్య కాలంలోనే విశాల్ తో కలిసి ఎస్.జె సూర్య నటించిన చిత్రం మార్క్ యాంటోని. ఈ సినిమాలో కూడా ఎస్.జె సూర్య తన నటనతో తెలుగు వారిని ఆకట్టుకున్నారు.

ezgif 3 814a2df585 1 Diwali special movies : దీపావళికి తెలుగు స్టార్ హీరోలు రెస్ట్ తీసుకున్నారా, తెలుగు నాట అనువాద చిత్రాల ఆట,

సినిమా హిట్టా ఫ్లాపా అన్న దానితో సంబంధం లేకుండా, తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తారు. అందుకు మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాను చక్కని ఉదాహరగా తీసుకోవచ్చు.

ఇక జిగర్ తాండ డబుల్ ఎక్స్ విషయానికి వస్తే గ్యాంగ్ స్టార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీయాలన్న దర్శకుడు, ఏకంగా గ్యాంగ్ స్టర్ తోనే సినిమా తీయాల్సి వస్తుంది.

అదే జిగర్ తాండ సినిమా, అయితే దానికి సీక్వెల్ గా చేస్తున్న సినిమా కాబట్టే జిగర్ తాండ డబుల్ ఎక్స్ అని టైటిల్ పెట్టారు. అంటే ఇందులో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

ఇక తెలుగు నుండి వస్తున్న చిన్నసినిమా, అలా నిన్ను చేరి. దినేశ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నాడు. హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ దినేష్ కి జోడి కట్టారు ఈ సినిమాలో.

ఈ సినిమా ప్రధాన అంశం ఏమిటంటే హీరో దినేష్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటాడు. అలా అని ఈ సినిమా కథ మొత్తం సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంది అని అనుకొనవసరం లేదు. ఇది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు ప్రొడ్యూసర్లు.

కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను మారేష్‌ శివన్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. అతనికి ఇది తొలి సినిమా. నవంబర్ 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుందని అంటున్నారు.

హాలీవుడ్ లో తెరకెక్కిన సూపర్ హీరోస్ సినిమాలంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. ఆ సినిమాలలో చూపెట్టే గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తాయి.

మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టాలివుడ్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. హాలీవుడ్ నటి బ్రీ లార్సన్‌ ఈ సినిమాలో కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రను పోషించింది.

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు నియా డకోస్టా దర్శకత్వం వహించారు. పార్వేల్స్ స్టూడియోస్ పాతకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను దీపావళి సమయానికి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

ఇక ఈ దీపావళికి దీపావళి పేరుతొనే ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది, స్రవంతి రవి కీషీర్ నిర్మించిన ఈ తెలుగు సినిమా పిల్లలను ప్రధాన పాత్రలుగా చేసుకుని తెరకెక్కించారు.

ఈ సినిమా కథ ఏమిటంటే పండుగకు కొత్త బట్టలు కావాలని మనవడు మారం చేయడంతో తన తాతయ్య పెంపుడు మేకను అమ్మకానికి పెడతాడు.

వెంకట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు కూడా ఈ దీపావళికి తన సత్తా చూపెట్టడానికి సిద్దమయ్యాడు. సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా రూపోందిన సినిమా టైగర్ – 3. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై, ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.

ఇక సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా తనకి పెళ్లయ్యాక ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటించడం విశేషం. సల్మాన్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్సులకు కొదువ ఉండదు.

అయితే ఈ సినిమాలో కత్రినా కూడా ఫైట్లు చేసి అబ్బురపరిచింది. పైగా బాత్ టవల్ కట్టుకుని కత్రినా చేసిన పోరాటాలు మరింత ఆకట్టుకుంటాయని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

ఈ సినిమాలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 12 వ తేదీన వెండితెరపై ఈ సినిమా సందడి చేయనుం

Leave a Comment