MLC Kavitha: 200యూనిట్లకి బిల్లు కట్టోద్దు.

Do not bill for 200 units.

MLC Kavitha: 200యూనిట్ల కి బిల్లు కట్టోద్దు.

ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) కొన్ని హామీలను ఇచ్చింది. వాటిలో ఒక్కొక్కదానిని అమలు చేస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కారు.

అయితే అందులో పేదవారికి మరింత మేలు చేకూర్చే పధకం ఒకటి ఉంది అదే గృహ లక్ష్మి(Gruha Lakshmi Scheem) పధకం, ఈ పధకం కింద 200 యూనిట్ల లోపు కరెంటును పేద ప్రజలు ఉచితంగా వినియోగించుకోవచ్చని,

దానికి బిల్లు కట్టే అవసరం లేదని ఎన్నికల హామీ లో పేర్కొన్నారు. అయితే ఇదే విషయాన్నీ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha MLC) మరోసారి గుర్తుచేశారు.

పేదవారు 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకు బిల్లు చెల్లించవద్దని ప్రజలకు సూచించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగభృతి కి సంబంధించి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదో చెప్పాలన్నారు.

అన్నిటికి మించి రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంక్షేమ పధకాల అమలు కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారని చెప్పారు,

అయితే ప్రజలకు మాత్రం ఈ దరఖాస్తు చేసుకునే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 44 లక్షల మందికి వృధాప్య పింఛన్లు(Old Age Pension) అందుతున్నాయని,

అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆ మొత్తాన్ని 4 వేల రూపాయలకు (₹4000) పెంచడానికి మరలా దరఖాస్తు చేసుకోవడం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.

ఇప్పటివరకు పింఛన్ పొందుతున్న వారందరికీ 2 వేల రూపాయల పింఛను ను 4 వేలకు పెంచి కొత్త సంవత్సరం ఒకటవ తేదీ నుండి అమలు చేయాలనీ కవిత కోరారు.

Leave a Comment