విద్యార్దులకు పరీక్షలు వస్తున్నాయంటే చాలు అటు పిల్లలకు తో పాటు తల్లి తండ్రులకు ఎంతో టెన్షన్ పాటు విపరీతమైన రకరకాల ఆందోళనలు గురవుతుంటారు. దీనికి కారణం అందరు చెప్పేది మంచి రాంక్ కొట్టాలని లేదా చదివింది గుర్తు ఉండడం లేదని రెండింటి లో ఎదో ఒక దానికి ఆందోళన చెందడం సహజం. ఇప్పుడు అలాంటి వారికోసం నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటో చూద్దాం రండి.
- మీరు కుర్చుని చదివే ప్రదేశాన్ని నిశ్శబ్దం గా ఉండడం తో పాటు మీ చదువు ఎక్కడ ఆగకుండా చూసుకోండి. మీరు కూర్చునే ప్రదేశం అలాగే ఆటంకం లేకుండా చదవడం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. అప్పుడు మీ దృష్తి చదువు మీదే ఉంటుంది. ముంది ఏకాగ్రత రావాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలని గుర్తు ఉంచుకోండి.
- మీరు చదవాలని అనుకున్న పేరా కాని పేజి కాని అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలను చిన్న చిన్న పదాలు గాను చిన చిన వ్యాఖ్యాలు గ రాసుకుంటే గుర్తు పెట్టుకోవడానికి అవకాసం ఉంటుంది. అంతే కాదు ఒక వాక్యం తర్వాత ఒక వ్యాక్యం రాసుకుంటూ ఆ పదాలను విడమర్చి రాయడం నేర్చుకోండి
- అందరు చేసేదే మీరు చెయ్యకండి, అంటే సబ్జెక్ట్ లను బట్టీ పట్టడానికి ట్రై చెయ్యకండి. చదువుతున్నది అర్ధం చేసుకుంటూ చదివితే అది ఎక్కువ కాలం గుర్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. చదివేది అంతా ఒకేసారి చదివేసి గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నించకండి. చదివేది ఎక్కువ గా ఉంటె దానిని చిన్న చిన్న వ్యాసాలు గా రాసుకుని చదివితే బాగా గుర్తు ఉంటుంది.
- మీరు రాసేటప్పుడు కొన్ని పేర్లను రాయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఆ పేర్ల ముందు వచ్చే ఆల్ఫా బెటికల్ ఆర్డర్ ఆధారం వాటిని గుర్తు పెట్టుకోండి. ఇలాచేస్తే ఆ పేర్లను ఈజీ గా గుర్తు పెట్టుకోవచ్చు.
- ఒక్కసారు కొందరి ప్రముఖుల పేర్లు రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి పేరు బదులు వారి రూపాన్ని గుర్తు పెట్టుకుంటే సంబందిత వ్యక్తి ఫోటో కనిపించగానే వారి పేరు తొందరగా గుర్తుకు వస్తుంది.
- మీరు చదివే పాఠాలను పరీక్షలను ద్రిష్టి లో ఉంచుకుని చదవడం చెయ్యకండి. ఇష్టం గా చదివితే కష్టం గా ఉండదని గుర్తించండి.మనం నేర్చుకునే ముఖ్య ఉద్దేశ్యం పరీక్షల లో మంచి మార్కులు కోసం కాకూడదు అది మీ విజ్ఞాన్ని పెంచే విధంగా చదివితే అది ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది.
- మీరు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఇంటరెస్ట్ ఎప్పుడు మీలో ఉండాలి అప్పుడే మీరు క్లాస్ రూమ్ లో పాఠాలను వినేటప్పుడు విసుగు రాకుండా ఉంటుంది. అలాగే మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఎప్పటికి మీ మెదడు లో ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది
- కొందరు విద్యార్దులు వారికి స్కూల్ కాని కాలేజ్ కాని ప్రారంభ సమయం లో మాత్రమే చదువుతారు. మళ్ళి ఏడాది చివరలో ఒక సారి చదువుతారు. అలా కాకుండా సమయం ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలను చదవడం రాయడం చెయ్యడం వల్ల ఆ పాఠాలు ఎంత వరకు గుర్తు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మర్చిపోతే మరల ఇంకోసారి చదవి రాయడం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల పరీక్షల సమయనికి ఎటువంటి గాబరా ఉండదు.
- మీరు స్కూల్ లో కాని కాలేజ్ లో కాని పాఠాలను విన్నాక అందులో ఉండే ముఖ్య అంశాలు అన్ని ఒక నోట్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల పరీక్షల సమయం లో టెన్షన్ పడకుండా ఉండచ్చు. పరీక్ష కి వెళ్ళే సమయం లో ఆ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఒక వేళా సగమే గుర్తు ఉంటె మిగతా సగం మళ్ళి ఒకసారి చదువుకుని చూడకుండా రాయండి.
- మీరు ఎప్పుడు ఒకే చోట కుర్చుని చదవడం వల్ల కాస్త విసుగ్గా అనిపిస్తుంది. ఆ సమయం లో చదివే ప్రదేశాన్ని మారుస్తూ ఉండండి దీనివల్ల విసుగు రాదు. మీరు ఎంచుకునే ప్రదేశం లో టీవీ లు, స్మార్ట్ ఫోన్లు లేకుండా చూసుకోండి. లేదంటే మీ ఏకాగ్రతకు దెబ్బ పడే ప్రమాదం ఉంది.
- మీరు కూర్చున్న చోట బాగా గాలి వెలుతురు ఉండేలా చూసుకోండి. పరిసరాలు సరిగ్గలేకపోయిన కుడా చదువు పై ఏకాగ్రత ఉండదు. కాస్త అప్పుడప్పుడు సేద తీరుతు ఉండండి. దీనివల్ల మీ మెదడు చల్ల బడి మళ్ళి చదవడానికి అవసరమైన శక్తీ లభిస్తుంది.
పైన వివరించినట్లు గా అన్నింటి లో శ్రద్ధ కనబరిచి మీ పరీక్షలలో నూరు శాతం మార్కులు సంపాదించడం పెద్ద కష్టం కాదు గుర్తు పెట్టుకోండి. మీరు ప్లాన్ ప్రాకారం శ్రమ పడితే విజయం మీదే.