ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా ! అయితే మీకు జరిగేది ఇదే ?

website 6tvnews template 2024 03 18T124816.109 ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా ! అయితే మీకు జరిగేది ఇదే ?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులు పెంచుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అలాగే కొంతమంది తమ పిల్లల ఆనందం కోసం చిన్న చిన్న కుక్క పిల్లలను కాని పిల్లులను కాని లేదా ఇతర జాతి పక్షులను కాని తెచ్చి బహుమానంగా ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం. ఇదివరకు రోజుల్లో డబ్బులు ఉన్నవాళ్లే పెంపుడు జంతువులు పెంచుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో దనికా పేద అనే తేడా లేకుండా పెంపుడు జంతువులు పెంచుకోవడం సాధారణంగా కామన్ అయిపోయింది.

వాస్తు ప్రకారం చూసినట్లయితే పెంపుడు జంతువులు పెంచుకోవడం సరైనదా కాదా అనే ఆలోచిస్తే, పెంపుడు జంతువులు పెంచుకోవడం చాలా మంచిది అని పండితులు, జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు ముందుగా పెంపుడు జంతువులే పసిగడతాయని, అలాగే తమ యజమానులకు సమాచారం అందిస్తాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా గృహంలో ఎటువంటి దోషాలు ఉన్నా కాని లోపాలున్న కాని ముందుగా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల మీదే ఆ ప్రభావం ఎక్కువ పడుతుంది.

దానివల్ల మన ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ముందుగా పెంపుడు జంతువులకే తెలుస్తాయి, ఆ విధంగా మనం వాటి ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ పెంపుడు జంతువులు పెంచడం వల్ల ముందుగా జరిగే నష్టాన్ని కానీ లోపాలు కానీ ముందుగానే తెలుసుకొని వాటి నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి, పెంపుడు జంతువులు ఉంచడానికి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని పెర్మనెంట్ గా ఉంచాలి.

వాటి స్థలాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఈ పెంపుడు జంతువుల కోసం కొంతమంది చిన్న చిన్న షెడ్లు కడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం చెప్పాలంటే కనుక దక్షణం వైపు గాని పడమర వైపు గాని నైరుతిలో గాని ఈ షెడ్లు నిర్మిస్తే కనుక వాస్తు దోషం ఉండదు. కొంతమంది పెంపుడు జంతువుల ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించరు, దానివల్ల ఆ ప్రభావం ఇంటి యజమానం మీద పడుతుంది, అనంతరం ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.

పెంపుడు జంతువులు పెంచుతున్న వాళ్ళు ఆ జంతువుకి అందుబాటులో ఆహారం, మంచినీళ్లు ఉంచాలి దీని వల్ల ఎటువంటి వాస్తు దోషం ఉండదని పండితులు చెప్తున్నారు. కొంతమంది వారు ఆహారం తింటున్నప్పుడు ఆ ఎంగిలి చేత్తోని పెంపుడు జంతువులకు ఎంగిలి అన్నం తినిపించడం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంగిలి అన్నం తినిపించిన వ్యక్తికి మహా పాపం చుట్టుకుంటుంది. ఎంగిలి చేత్తో అన్నం తినిపించడం వల్ల వాటికి ఉన్న మహా పాపాలు ఏముంటాయో అవన్నీ ఆ వ్యక్తికి అవి సంక్రమిస్తాయి.

కాబట్టి ఎవరు ఎంగిలి చేత్తో పెంపుడు జంతువులకి ఆహారం తినిపించకండి ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు నిర్లక్ష్యం చెయ్యకండి. వెంటనే డాక్టర్ కి చూపించడం వల్ల ఆ వ్యాధి మనుషులకు సోకకుండా చూసుకోవచ్చు. పెంపుడు జంతువులను మన కుటుంబ సబ్యులు గా చూసుకోండి, ఎప్పుడు ఆనందం గా ఉండండి.

Leave a Comment