You know about Dev Diwali?: దేవ దీపావళి గురించి మీకు తెలుసా?

Add a heading 2023 12 08T150144.427 You know about Dev Diwali?: దేవ దీపావళి గురించి మీకు తెలుసా?

You know about Dev Diwali?: దేవ దీపావళి గురించి మీకు తెలుసా?

దీపావళి గురించైతే మనందరికీ తెలుసు కానీ దేవ దీపావళి గురించి తెలుసా…ఈ దేవదీపావళిని ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు. కార్తిక పూర్ణమి చాలా విశేషమైన పర్వదినం.

హరిహరులిద్దరికీ ప్రత్యేకమైన రోజు. ఈరోజున దేవాలయన్నీ కూడా భక్తులతో కిటికటాడుతుంటయి. సాయంత్రం అయితే దీపకాంతు శోభను వర్ణించలేం…అలాంటి కార్తీక పూర్ణమినే దేవదీపావళి అనీ, కైశిక పూర్ణిమ అనీ,

కుమారదర్శనమనీ ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. త్రిపురాసురులని శివుడు సంహరించినదీ, వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించింది ఈ రోజునే.

ఏంటీ దేవదీపావళి అంటే:

దేశమంతటా కార్తిక పూర్ణమిని ఘనంగా నిర్వహించుకున్నప్పటికీ..ఉత్తరభారతంలో మాత్రం దేవదీపావళి అనే పేరుతో చాలా విశేషంగా చేసుకుంటారు. వారికి కార్తీక పూర్ణమితో కార్తీకమాసం ముగుస్తుంది. మఖ్యంగా శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణంలో చాలా బాగా జరుపుకుంటారు.

సాధారణంగా మనకు ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు రకాల అయనాలున్నాయి. దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి. ఈ అయనంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఈ సమయంలో దేవతా శక్తులన్నీ సన్నగిల్లుతాయి.

అందుకే వారికి శక్తిని కలిగించడం కోసం దేవ దీపావళి అనే పేరుతో ఆకాశ దీపాలను, ఇతర దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు ఆశ్వయుజ అమావాస్య నాడు వచ్చే దీపావళి పితృదేవతల కోసం చేస్తారు. ఈ రోజున ఉత్తరం వైపుగా దీపాన్ని ఉంచి పెద్దల కోసం పూజిస్తారు. అయితే కార్తీక పూర్ణమి రోజున వచ్చే ఈ దీపావళిని మాత్రం దేవతల ప్రీతి కొరకు చేస్తారు.

ప్రత్యేకించి కాశీలోనే సంబరాలు:

Add a heading 2023 12 08T150433.606 You know about Dev Diwali?: దేవ దీపావళి గురించి మీకు తెలుసా?


కాశీలో విశేషించి దేవదీపావళిని చేస్తారు. ఎందుకంటే కాశీనగరం సాక్షాత్తూ పరమశివుడు కొలువైన ప్రాంతం, త్రిపురాసురులను సంహరించినది పరమశివుడే కాబట్టి అక్కడ అంత విశేషంగా నిర్వహిస్తారు. కాశీలో కూడా విశేషించి పంచగంగా ఘాట్ లో ఎక్కువగా చేస్తారు.

దూద్ పాప, కిరణా, గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమే పంచగంగా ఘాట్. బిందుమాధవ మందిరం దగ్గర ఉంటుంది.

కాశీలో ఒక్కో మాసంలో ఒక్కోఘాట్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకే ఆయా మాసాలలో ఆయా ఘాట్ లలో విశేషించి స్నానాదులు నిర్వహిస్తారు.

కార్తీకమాసంలో కాశీలో ఉన్న ఈ పంచగంగా ఘాట్ లో స్నానాదులు ఆచరించాలని కాశీఖండంలో రాసి ఉంది. కాబట్టి విశేషించి ఈ ఘాట్ లోనే దేవదీపావళిని నిర్వహిస్తారు.

వృషోత్సర్జనం ఉత్సవం:

ఇక మరికొన్ని ప్రాంతాలలో కార్తీక పూర్ణమి రోజున కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. తెలంగాణలో జన్నెకు విడవడం అని దీన్ని అంటారు.

అందుకే తెలంగాణలో కార్తీక పూర్ణమిని జీడికంటి పున్నమ అనే పేరుతో పిలుస్తారు. వృషోత్సర్జనం అంటే ఆవుకు, ఆంబోతుకు వివాహాన్ని జరిపించి, వాటి దగ్గర పెద్దల ప్రీత్యర్థం పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఆ ఆంబోతుకు అచ్చు వేయించి స్వేచ్ఛగా గ్రామంలో వదులుతారు. దీని వల్ల గయలో వారి ఆత్మశాంతికోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది.

ఈ పద్ధతి గురించి శాస్త్రాలలో కూడా రాసి ఉంది. కానీ ఆనవాయితీ ఉన్న అతికొద్ది మంది మాత్రమే ఈ పద్థతిని చేస్తారు.. ఇలా భారతదేశమంతటా వివిధ రకాల పేర్లతో కార్తీక పూర్ణమిని ఘనంగా జరుపుకుంటారు.

Leave a Comment