Payal Ghosh Sensational Comments On Salaar: సలార్, డుంకి చెత్త సినిమాలు అంటున్న బాలీవుడ్ నటి ఎవరో తెలుసా?

Do you know any Bollywood actress who says Salar and Dunki are worst movies

Payal Ghosh Sensational Comments On Salaar: సలార్, డుంకి చెత్త సినిమాలు అంటున్న బాలీవుడ్ నటి ఎవరో తెలుసా?

(Salaar)సలార్:

సలార్.. ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రలుగా నటించిన సినిమా.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన EE సినిమా, ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన 3 రోజులకే 400 కోట్లు కొల్లగొట్టి, బాక్స్ ఆఫీసులోని రికార్డులన్ని బద్దలుగొట్టింది.
సినిమా పరంగా చూస్తే చాలా సానుకూల సమీక్షలు అందుకుంది.

ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ “డుంకి” సినిమాతో ఢీ కొంది, అప్పటికి కలెక్షన్లలో విజృంబించింది.

(DUNKI)డుంకి :

” జవాన్ ” హిట్ తరువాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, భారీ అంచనాలతో తెరకెక్కిన చిత్రం “డుంకి”
ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కలెక్షన్లలోనూ ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

పాయల్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు :

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఈ రెండు సినిమాలపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.
ఈ ఏడాది అన్నీ చెత్త సినిమాలు వస్తున్నాయని, సలార్, డుంకి లాంటి చెత్త సినిమాలు తనకు అస్సలు నచ్చలేదని చెప్పింది.

డుంకి దర్శకుడు రాజకుమార్ హిరాని తన కెరీర్ లోనే ఫ్లాప్ సినిమా తీశాడాని, సలార్ కూడా చెత్త సినిమా అని కానీ ప్రభాస్ పవర్ఫుల్ మాన్ కాబట్టి ఆ సినిమా కలెక్షన్లు రాబడుతుందని అన్నది.

ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె కెరీర్లోని ఒడిదుడుకుల వల్ల, ఇపుడు అందరినీ ఒక్కసారిగా తనని ఆకర్షించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ, ఆమెను విమర్శిస్తున్నారు.

Leave a Comment