E-shram card How to Apply : ఇ-శ్రమ్ కార్డును ఎలా తీసుకోవాలో తెలుసా..ఉచితంగా 2 లక్షల రూపాయల.

Do you know how to get e-shram card..2 lakh rupees for free.

E-shram card How to take : ఇ-శ్రమ్ కార్డును ఎలా తీసుకోవాలో తెలుసా..ఉచితంగా 2 లక్షల రూపాయల

భీమా…కల్పిస్తున్న కేంద్రం…దేశంలో పేదిరికాన్ని తగ్గించడానికి, సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తుస్తుంది.

అయితే, వాటిలోకొన్నీటికి మాత్రమే ఆదరణ లభిస్తోంది. మరి కొన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

అటువంటి జాబితాలోE-shram Card ఒకటని చెప్పుకోవచ్చు. దీనినే శ్రామిక్ కార్డుగా కూడా పిలుస్తారు. ఈ కార్డును పొందడం ద్వారా ఉచితంగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమాతో పాటు, మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అయితే, ఇంతకీ ఈ E-shram Card ను ఎలా తీసుకోవాలి, దానికి ఎవరెవరు అర్హులు? ఆ కార్డు వలన ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? దానిని ఎలా అప్లై చేసుకోవాలి?

Eligibility Details like:

అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రత్యేక కార్డును E-shram Card అంటారు.
దేశంలో ఎక్కువ మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పని చేస్తూ వుంటారు.

Add a heading 2023 12 19T135719.307 E-shram card How to Apply : ఇ-శ్రమ్ కార్డును ఎలా తీసుకోవాలో తెలుసా..ఉచితంగా 2 లక్షల రూపాయల.

అయితే, వీరికి ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఏమి ఉండవు. సంవత్సరాలనుండి ఒకటే పని చేస్తున్నా కూడా అలాంటి కార్మికులకు, అస్సలు గ్రాట్యుటీ అంటే ఏమితో కూడా వీళ్లకు తెలియదు.

అటువంటి శ్రమ జీవుల భవిష్యత్తు భద్రత కోసం, వృద్ధాప్యంలో వారికి ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేవిధంగా కేంద్ర ప్రభుత్వం E-shram Card పేరుతో ఈ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తుంది.

ఇలాంటి కార్మికులకు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం ఈ శ్రామిక్ కార్డు పోర్టల్​ను2021, ఆగస్టులో ప్రారంభించింది.

ఈ పోర్టల్ ద్వారా.. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిట్స్ వారికి అందించటం కేద్రప్రభుత్వ ఉద్దేశం. దీనికోసం అన్నీ రకాల కూలీలకు E-shram Card ఇస్తున్నారు.

ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లిస్తుంది.

అదే శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షలు బీమా కవరేజీ బాధిత కుటుంబానికి లభిస్తుంది. E-shram Card ద్వారా కేవలం ఇన్సూరెన్స్

మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పని ముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు అందుకునే అవకాశం కూడా కల్పించింది.

వివిధ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, రోజు వారీ కూలీలు, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, తక్కువ వేతనాలు అనగా రూ.15 వేల లోపు ఉన్న ఉద్యోగులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆదాయపు పన్ను చెల్లించని వారు, రేషన్‌కార్డు దారులు ఇలా 16 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు 28 కోట్ల ఇ-శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఇతర పథకాల ప్రయోజనాలను వీరు పొందేందుకు వీలుగా రేషన్ కార్డుతో E-shram Card ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ E-shram Card పొందటానికి ఆన్‌లైన్ లో Eshram.gov.in లో లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి.

ముందుగా ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకొని, ఆ తర్వాత మొబైల్​కు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తరువాత మీ అడ్రస్, విద్యార్హతలు వంటి వివరాలు నమోదు చేయాలి.

అలాగే, ఏ పనిలో నైపుణ్యం ఉంది, పని స్వభావంతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా ఎంటర్ చేయాలి. చివరగా ధ్రువీకరణ కోసం మీ మొబైల్​కు వచ్చిన ఓటీపీ ని నమోదు చేయడం ద్వారా ఈ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

Leave a Comment