అత్తారింట్లో రకుల్ చేసిన పనేంటో తెలుసా?

website 6tvnews template 2024 02 26T130412.557 అత్తారింట్లో రకుల్ చేసిన పనేంటో తెలుసా?

Do you know what Newly wed Rakul Preet Singh did at mother- in- law’s home : నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh) తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని(Jackie Bhagnani) పెళ్ళాడి ఓ ఇంటిదైంది. ఫిబ్రవరి 22న గోవాలోని ఓ హోటల్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. కొద్దిమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం పంజాబీ సంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా జరిగింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ పెళ్లి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత రకుల్ తన అత్తారింట్లో అడుగుపెట్టింది. మెట్టినింట్లోకి అడుగుపెట్టిన మొదటిసారి రకుల్ ఓ పని చేశారు.

అత్తారింట్లో హల్వా చేసిన రకుల్ :

పంజాబీ ఆనంద్ కరాజ్ (Punjabi Anand Karaj) సింధీ(Sindhi) సంప్రదాయాల ప్రకారం రకుల్ (Rakul), జాకీ భగ్నానీ(Jackie Bhagnani)ల పెళ్లి జరిగింది. వారి సంప్రదాయం ప్రకారం అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు ఏదైనా తీపి వంటకం చేసి అత్తింటివారికి తినిపించాల్సి ఉంటుంది.

దానినే చౌకా చర్దానా(Chauka Chardhana) అని అంటారు. సాధారణంగా ఎక్కువగా కొత్త కోడళ్ళు హల్వా, ఖీర్ వంటివి చేస్తుంటారు. ఆ సంప్రదాయంలో భాగంగానే రకుల్ అత్తారింటికి వెళ్లిన తొలిసారి స్వయంగా హల్వా తయారు చేసింది . రకుల్ హల్వా చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రకుల్ సినిమా ప్రాజెక్ట్స్ :

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh)చివరిసారిగా తెలుగులో వైష్ణవ్ తేజ్ (vaishnav tej ) హీరోగా వచ్చిన కొండ పొలం(Kondapolam) సినిమాలో కనిపించింది. టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. హిందీ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలకు సైన్ చేసింది. కమల్ హాసన్(Kamal Haasan) నటిస్తున్న ఇండియన్2 (Indian 2)లో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బాలీవుడ్ లోనూ ఓ ప్రాజెక్ట్ సైన్ చేసింది. పెళ్ళైనా కూడా రకుల్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Leave a Comment