సైబర్ క్రైమ్స్, ఫేక్ న్యూస్ వ్యాప్తిలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రమో తెలుసా?
ఆధునిక యుగంలో మానవ మనుగడ ఎన్నో మార్పులకు చేరుకుంది.. దానితో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో మనిషి జీవన విధానంలో, ఆలోచన విధానంలో కూడా ఎన్నో సంచలనమైన మార్పులు చోటు చేసుకున్నారు..
మార్పులు మంచికి సంకేతాలు అయితే, మరికొన్ని మానవ మనుగడకు ఆటంకాలుగా మారుతున్నాయి.. ఈ మధ్య కాలంలో మోసాలతో పాటు ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి..
అయితే, ఈ సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో కూడా తన సత్తాను చూపిస్తున్నట్టు కణాంగాలు వివరిస్తున్నాయి..
ఆర్ధిక నేరాల్లో కూడా తెలంగాణా రాష్ట్రమే అగ్రస్థానంలో ఉండడం ఎంతో విచారకరం. 2022 లో దేశంలో నేరాలకు సంబంధించి జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా నివేదికను విడుదల చేసింది
రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఎన్సిఆర్బి 2022 లో దేశంలో నమోదైన నేరాల నివేదికలో ఆ విషయం వెల్లడైంది.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. పోలీసులు అనేకమార్లు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నా పలువురు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని జేబులు గుళ్లచేసుకుంటున్నారు. మహిళలపై నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంది.
హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నకిలీ వార్తల వ్యాప్తిలోనూ దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని వేదికలు తెలుపుతున్నాయి.
సైబర్‌నేరాలకు సంబంధించి..రాష్ట్రంలో 15వేల 297 కేసులు నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మోసాలకు సంబంధించి బ్యాకింగ్‌లో 3వేల 223 నేరాలు నమోదుకాగా వాటిలో కూడా మొదటి స్థానంలో ఉంది.
ఏటీఎం మోసాల్లో 624 కేసులు నమోదుతో రెండోస్థానంలో ఉంది. బెదిరించి వసూళ్లకి సంబంధించి 447 కేసులతో ముందుండి మూడోస్థానంలో నిలిచింది. లైంగిక వేధింపులు కేసులలో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం 7వ స్థానంలో ఉంది.
ఇంకా, వాహనచోరీల కేసులతో 8వ స్థానంలో నిలిచింది. దోపిడీలకి సంబంధించి 520, నమ్మకద్రోహంపై 595, అక్రమ నిర్భంధం 1372, అపహరణలు 2981, పిల్లల అపహరణలపైన 700కేసులు నమోదయ్యాయి.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు 1787, మనుషుల అక్రమ రవాణా కేసులు 233, ఆహారకల్తీ కేసులు 1635, నకిలీ వార్తల వ్యాప్తిపై 264 కేసులు నమోదైనట్లు తేలింది.
మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద 1279 కేసులు నమోదు. ఆత్మహత్యకు ప్రేరేపించడంపైన 375, 137 కేసులు నమోదు అయ్యాయి.
వరకట్న మరణాలు 470, లైంగిక దాడి, అత్యాచారం, కేసులు కూడా అధికంగానే కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలో పేర్కొంది.
సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలను అధికారులు ఎంత అప్రమత్తం చేస్తున్నా కేసులు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు..