T10 Record breaking: 43 బంతులకే 194 రన్స్ చేసింది ఎవరో తెలుసా..రికార్డ్ బ్రేకింగ్.
ఇప్పటి వరకు మనం టి 20 మ్యాచులు చూసాం, ఒకప్పుడు ఉన్న వన్డే మ్యాచులకు ఇవి కుదింపు, 50 ఓవర్ల వన్డే మ్యాచ్ లో రెండు జట్లు ఆడాలి, అంటే వంద ఓవర్లు ఆడాలి రెండు జట్లు కలిపి.
కానీ ఈ టి 20 విషయంలో అలా కాదు, వన్డే మ్యాచ్ లో ఒక జట్టు బాటింగ్ చేసే సమయంలోనే ఈ టి 20 మ్యాచ్ మొత్తం ముగిసిపోతుంది. అయితే ఈ టి 20 మ్యాచ్ లో బ్యాటింగ్ విధానం చాలా వేగంగా ఉండాలి.
బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే నిలదొక్కుకోవాలి, స్టెబిలిటీ కోసం ఎక్కువ సమయం తీసుకోకూడదు. అలా చేస్తే బంతులు వృధా అవుతాయి. కాబట్టి వీలైనంత త్వరగా నిలకడ తెచ్చుకుని బంతులను బౌండరీ దాటించాలి. లేదంటే కష్టమే.
టి 20 నే ఇలా ఉంటె మరి టి10 ఎలా ఉంటుందో ఊహించుకోండి..ఆ మ్యాచ్ లో ప్రతి ప్లేయర్ బ్యాటింగ్ లో విజృంభించాలి, ఏమాత్రం అటు ఇటైనా అవుట్ చేసి ఫెవిలియం కి పంపించేస్తారు. అయినప్పటికీ బాట్ చేతపట్టిన క్షణం నుండే వీర బాదుడు బాధాలి,
అయితే టి 10 మ్యాచ్ లో బ్యాటింగ్ ఎంత ఫాస్ట్ గా ఉండాలో చూపించాడు ఒక ఆటగాడు, కేవలం 24 బంతుల్లో సెంచరీ కొట్టి శభాష్ అనిపించాడు. అక్కడితో ఆగకుండా 43 బంతుల్లో 194 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు.
తన ఆటతీరుతో మ్యాచ్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడు, తన జట్టుకి ఒంటి చేత్తో విజయాన్ని తెచ్చిపెట్టాడు. వేసిన ప్రతి బంతిని ఆకాశంలోకి లేపుతుంటే బౌలింగ్ వేసే ఆటగాడికి మరో బంతి వేయడానికి వణుకుపుట్టేలా మారింది పరిస్థితి. ఈ మ్యాచ్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అసలు ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది ?ఈ మ్యాచ్ లో ఏ రెండు జట్లు తలపడ్డాయి ? అవతలి జట్టులోని బౌలర్లకు చెమటలు పెట్టించిన ఆ బాట్స్ మెన్ పేరేంటి అనే వివరాలు చూద్దాం.
యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ మ్యాచ్ లో చెలరేగిపోయి ఆడాడు ఓ బ్యాట్స్ మెన్ అతని పేరు హమ్జా సలీమ్ దార్. కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేశాడు. ఈ 193 పరుగులో 22 సిక్స్‌లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది అంటే..
కాటలున్యా జాగ్వార్ ఇంకా సోహల్ హాస్పిటల్టెట్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా జాగ్వార్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరులో అభిక భాగం హమ్జా సలీమ్ దార్ దే.
అయితే హమ్జా సలీమ్ దార్ ఈ భారీ స్కోర్ చేసిన క్రమంలో ఒక ఆటగాడి రికార్డు కూడా బద్దలు కొట్టేశాడు. టీ10 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా లూయిస్ పేరు ఉండేది.
లూయిస్ 163 పరుగులు చేశాడు. కానీ హమ్జా సలీమ్ దార్ చుస్తే లూయిస్ రికార్డును మించి 30 పరుగులు చేశాడు. దీన్ని బట్టి చుస్తే సమీప భావిష్యత్తులో హమ్జా సలీమ్ దార్ రికార్డు బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి. కేవలం ఇది మాత్రమే కాదు హమ్జా
సలీమ్ దార్ టి 10 లీగ్ లో 3 వేల పరుగుల స్కోర్ సాధించిన బ్యాట్స్ మెన్ లో రెండవ వ్యక్తిగా ఘనత సాధించాడు. ఇక సోహల్ హాస్పిటల్టెట్ బ్యాటింగ్ లో కూడా చతికిల పడింది.
8 వికెట్లు నష్టపోయి కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. 158 భారీ తేడాతో కాటలున్యా జాగ్వార్ జట్టు విజయాన్ని దక్కించుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో హమ్జా సలీమ్ దార్ తోపాటు మరో ఆటగాడు కూడా మెరిశాడు. హమ్జా సలీమ్ దార్ అంత కాకపోయినా ఎంతో కొంత పరవాలేదనిపించాడు. 19 బంతుల్లోనే 58 పరుగులు సాధించాడు.
అయితే ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గురించే తెలుసుకున్నాం, అయితే ఈ మ్యాచ్ లో అత్యధికంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ గురించి కూడా ఒక్కసారి చూడాల్సిందే, సోహల్ హాస్పిటల్టెట్ జట్టులోని వారిస్ అనే ఆటగాడు కేవలం ఒక్క ఓవర్ లోనే 43 పరుగులు అందించాడు.