
Viral Photo : ఏ ఫోటో లో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా..ఫొటోలో ఉన్నది ఆ డైరెక్టర్ అని అస్సలు నమ్మలేరు..
సినీ ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్లు హీరోలు వారి వారి దర్శకులకు బాగా సాన్నిహిత్యంగా ఉంటారు. అందుకు కారణం కూడా లేకపోలేదు, అదేమిటంటే వారు కెరియర్ ను కలిసి బిగిన్ చేస్తారు.
హీరోయిన్ లేదా హీరో అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్న రోజుల్లోనే సదరు దర్శకులు కూడా అప్ కమింగ్ డైరెక్టర్స్ గా ఉంటారు. అలాంటి సమయంలో వారికి ఫ్రెండ్షిప్ కుదురుతుంది.
మామూలు జనాలే ఫ్రెండ్స్ అయ్యాక అనేక సందర్భాల్లో ఫోటోలు తీసుకుంటారు, మరి సినిమా సెలెబ్రెటీలు అన్నాక ఫోటోలు తీసుకోకుండా ఉంటారా ? అయితే వాటిని వారు స్టార్ హోదా లోకి వచ్చాక బయట పెడుతూ ఎదుటువారికి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు.
అలా నిన్నటి తరం హీరోయిన్ సంగీత ప్రెసెంట్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ వెంకట్ ప్రభు కి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. వెంకట్ ప్రభు బర్త్ డే సందర్భంగా వారు దాదాపు కొన్ని ఏళ్ళ క్రితం తీసుకున్న ఫోటోను ఇపుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటో చుసిన వారెవ్వరూ అయన వెంకట్ ప్రభు అని అస్సలు గుర్తు పట్టరు. ఎందుకంటే తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సంగీతనే ఆ ఫొటోలో చూసి గుర్తు పట్టడం కష్టం కాబట్టి.
సంగీత వెంకట్ ప్రభు చాలా మంచి స్నేహితులు. ఖడ్గం సినిమాతో తెలుగు తెరపైకి వచ్చిన సంగీత పెళ్ళాం ఊరెళితే, మా ఆయన చంటి పిల్లాడు, విజయేంద్ర వర్మ, సంక్రాంతి వంటి స్ట్రెయిట్ చిత్రాలతోనే కాకుండా శివ పుత్రుడు, వంటి అనువాద చిత్రాలతో కూడా తెలుగువారిని అలరించింది.
కెరియర్ పీక్ టైం లో ఉన్నప్పుడే సరైన సమయంలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సంగీత. కానీ 2020 లో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూతో మరో మారు తెరపై మెరిసి తన అందానికి అభినయానికి సాటిరారు ఎవ్వరు అని నిరూపించుకుంది. ఇక హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘మసూద’లో ఫుల్ లెంగ్త్ రోల్ పోషించి వావ్ అనిపించుకుంది.
పైగా సంగీత సినిమాలతో పాటు టివి షోలలో కూడా మెరుస్తోంది. స్టార్ డెరెక్టర్ వెంకట్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగచైతన్యతో కస్టడి సినిమాను తెరకెక్కించారు.
సరోజ, గోవా, గ్యాంబ్లర్, బిర్యానీ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించి సినిమాల పట్ల తన అభిరుచిని, దర్శకత్వంలో తన భిన్నమైన శైలిని చాటుకున్నారు.
ప్రస్తుతం తమిళ్ లో ఇళయ దళపతి విజయ్ తో ఓ సినిమా రూపొందిస్తున్నారు. మొత్తానికి సంగీత షేర్ చేసిన ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.