Dawood Ibrahim AI Image: దావుద్ ఎలా ఉన్నాడో చూశారా?
దావూద్ ఇబ్రహీం ఇది ఒక అండర్ వరల్డ్ డాన్ పేరు, ఇతను అనేక దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇతడికి కొన్ని దేశాలు కావాలనే ఆశ్రయం ఇస్తూ కాపాడుతున్నాయి అనే వదంతులు కూడా ఉన్నాయి.
అయితే చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటాడని అని కూడా అంటారు. అందుకు నిదర్శనంగానే 1986లో షార్జాలో జరిగిన భారతదేశం-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో తీసిన అతడి ఫోటో ను చూపెడతారు.
బాంబే లో ఇతని గురించి రకరాల కధలు ప్రచారంలో ఉన్నాయి, 1993 ముంబై బాంబు పేలుళ్లల కేసులో నిందితునిగా ఉన్న దావుద్ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నాడు. అయితే పాక్ మాత్రం దావుద్ వారి వద్ద ఉన్నట్టు అంగీకరించదు.
How Dawood photo came out:
కొందరు దావుద్ నేపథ్యంలో కధలు అల్లుకుని సినిమాలు కూడా తీశారనే వార్తలు కూడా అప్పట్లో ప్రచారంలో ఉండేవి. అయితే ఇప్పటికి దావుద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు అన్నది ఎవ్వరికి తెలీదు.
దావూద్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ గానే ఉన్నప్పటికీ అతని జాడను కాదు కదా కనీసం అతని లేటెస్ట్ ఫోటో ను కూడా చిక్కించుకోలేకపోవడం పెద్ద చర్చకు దారి తీసే అంశం.
అయితే ఉన్నట్టు ఉంది దావూద్ ఇబ్రహీం ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. అతని పై విష ప్రయోగం జరిగింది అని అతడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని వార్తలు పుట్టుకొచ్చాయి.
అలంటి పరిస్థితుల్లో దావుద్ గురించిన వార్తలు ఒక్కసారిగా మరోసారి చర్చకు వచ్చాయి. దావూద్ ఇబ్రహీం కి విష ప్రయోగం జరిగితే, అతడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే అతని ఫోటో అయినా బయటకు రాలేదా ? అసలు అతను ఎలా ఉంటాడు అనే విషయం అందరిలోనూ ఆశక్తిని రేకెత్తిస్తోంది.
Dawood photo created by using AI:
భారతదేశం లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ భారతీయ గూఢచార సంస్థలచే బహిరంగపరచబడిన ఒక ఫోటో మినహా ఒక్క ఫోటో కూడా విడుదల చేయకుండా ఒక ఎనిగ్మాగా మిగిలిపోయింది.
అయితే ఒక ప్రముఖ వార్తా సంస్థ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడో అనే దానీపై ఒక ఫోటోను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టక్నాలజీని ఉపయోగించింది,.
అందుకోసం ఫోటో సాఫ్ట్‌వేర్ మైండ్‌జర్నీ సహకారాన్ని ఆ సంస్థ ఉపయోగించుకుంది. దావూద్ వయస్సు, ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకున్నారు, అంతే కాదు కొత్త ఫోటో రూపొందించడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫొటోలను కు పరిగణనలోకి తీసుకున్నారు.
దాంతో ఒక కొత్త చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ ఫోటోను చుసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో బయటకు రావడంతో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
what happened after poisoning:
దావూద్ పై విష ప్రయోగం గురించి మాట్లాడుకుంటే దావూద్‌కి విష ప్రయోగం జరగడంతో అతడిని భారీ భద్రత నడుమ కరాచీలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారట.
మరి దావుద్ ను ఆసుపత్రికి తీసుకెళితే వ్యవహారం మాములుగా ఉండదు కదా, అందుకే ఆస్పత్రిలో ఓ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేశారట, ఇక దావూద్‌కు మాత్రమే ఆ ఫ్లోర్ లో చికిత్స అందిస్తున్నారని కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రత్యేక కథనాలను వెలువరించాయి. దావుద్ ను ఉంచిన ఆ ప్లోర్ లోకి ఎవ్వరికి ఎంట్రీ ఉండదు,
కేవలం వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి సిబ్బందిని, వైద్యులను మాత్రమే లోపలి అనుమతిస్తున్నారని తెలుస్తోంది. ఇక దావుద్ కి సంబంధించిన ఎటువంటి విషయాలు వెల్లడి కాకుండా ఉండేదుకు ఎన్ని జాగ్రత్తలు చేపట్టాలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు.
ఈ క్రమంలోనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయట. యూట్యూబ్, ఫేస్‌బుక్,
ట్విట్టర్ సేవలకు బ్రేక్ పడినట్టు సమాచారం. ఇక 2018సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి దావూద్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.