US President Joe Biden: ఎన్నికలలో పోటీ చేయవా.. నిన్ను వదలను బొమ్మాలి.
అగ్రరాజ్యం అమెరికా లోకూడా ఎన్నికల లొల్లి మొదలైయింది. అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగడానికి సమయం దగ్గరకు రావడం తో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అలిగి కూర్చున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిలో క్వశ్చన్ మార్క్ గా మారాయి. ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరిస్తున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పలు విమర్శలు చేసాడు.
ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల బరిలో లేకపోతే తాను కూడా పోటీ చేసే అవకాశాలు తక్కువని వ్యాఖ్యానించారు. కానీ ఈ దేశం కోసం ఆయనను మాత్రం గెలవనివ్వమన తెలిపారు.
అయితే, అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన జో బైడెన్‌కు అమెరికా ఓటర్లు మరోసారి అధికారాన్ని కట్టబెడతారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా..
2024 ఎన్నికల్లో బైడెన్ వయసు కీలకాంశం కానుంది. ఆయన రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి అయ్యేనాటికి 86 ఏళ్ళలోనికి అడుగు పెడతాడు. ఈ నేపథ్యంలో..
మరోవైపు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలిస్తే అమెరికా నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన ట్రంప్…’ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే నియంతగా మారనని, కానీ, ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు మాత్రం నియంతగా ఉంటానని
ప్రచారం మొదలుపెట్టాడు.ఆ ఒక్క రోజు ఎందుకంటే…మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేసి, చమురు డ్రిల్లింగ్‌ను విస్తరించడానికని చెప్పుకొస్తున్నాడు.
అయితే, బైడెన్, ట్రంప్ ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించారు.
డోనాల్డ్ ట్రంప్ వైపే ఓటర్లు మొగ్గుచూపుతున్నారని
సర్వేలు వెల్లడిస్తున్నాయి.వచ్చే ఏడాదిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు మాజీ డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలే ఓ పోల్ తేలింది. ట్రంప్ కంటే బైడెన్ 10 పాయింట్లు వెనకబడినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్ కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. 51-42 తేడాతో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నట్లు ఆ పోల్ కూడా పేర్కొంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మిగిలినవారి కంటే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది…