ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ మూఢ విశ్వాసాలు ఉంటాయి. అవి వారి ఆచార వ్యవహారాల బట్టి పాటిస్తారు. అయితే వాటిని కొందరు అంధవిశ్వాసాలని కొట్టిపరేస్తారు. భారతీయలు కొన్ని విషయాలను శకునాలుగా భావిస్తారు. ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు రావడం అలాగే కొందరికి కళ్ళు అదరడం లేదా బల్లి అరవడం, అద్దం పగిలిపోవడం, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వెనుకనుంచి ఎవరైనా పిలవడంమ్ ఇలాంటి వాటిని శకునాలుగా భావిస్తారు.
జీవితంలో ఇటువంటి నమ్మకాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్థాయిని చెప్పవచ్చు. జరుగబోయే విషయాలను ముందు గానే వారికి ఎదురైన శకునాలు బట్టి తెలుసుకుంటారు. కొన్ని సార్లు అవి నిజం కావచ్చు కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి మనం కొన్ని సార్లు వాటిని విస్మరించాలి, లేదంటే కొన్ని చెయ్యాల్సిన పనులు ఆగిపోతాయి. కొందరు పాలు పొంగితే అపసకునం అంటారు.
మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది దేనికి సంకేతం అనుకోవాలి ఇది మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా ముందు హెచ్చరికగా భావించాలా ఇలాంటి సందేహాలు వస్తూవుంటాయి చాలా మందికి. అయితే ఈ విషయంలో ఇప్పుడు కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం ! ఉదాహరణకు: గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది మన హిందువులందరికీ, అందులో భాగంగా ఆ సమయం లో కొన్ని పాలు చిందుతాయి, పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగిస్తారు గృహప్రవేశ సమయం లో ఇలా చేస్తే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని, అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు ఏర్పడతాయని చెప్తారు పండితులు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు, అలాగే అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారని వేద పండితులు చెప్తున్నారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు.
కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. పాలు అనేవి సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే, శుద్ధికి ప్రతీకగా పాలు వాడుతూ ఉంటారు. పవిత్రమైన ఆవు పాలు కు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యపాత్రను ఇస్తాము. యజ్ఞ యాగాది క్రతువులలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారు చేసిన నేతిని మాత్రమే ఉపయోగిస్తారు.
పాలు చిందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా బావిస్తారు హిందువులు. అంటే మీరు ఒక్క రోజులో ధనవంతులు అవుతారని కాదు.కాకపోతే, అదృష్టం మీ వెంట ఉందని సంకేతం గా భావించాలని శాస్తం చెప్తోంది. మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని, కొంత ధనం మీ వద్దకు వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఇదొక సూచిక. పాలు పొంగితే డబ్బులు కుడా అలాగే పొంగుతాయని పూర్వకాలపు పెద్దలు చెప్తారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి సూచికగా చూడాలని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ, పొరపాటున పాలు గనక పొంగితే, కంగారుపడకండి. దీనిని శుభసూచికంగానే భావించండి.