Don’t make these mistakes on Mauni Amavasya : మన హిందూ మతంలో అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది. ప్రతి నెలలో వచ్చే అమావాస్యలలో మౌని అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, పేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని హిందూ మత విశ్వాసం.
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున పలు రకాల దానాలు చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని హిందువులకు ఎంతో నమ్మకం. అలాగే మౌని అమావాస్య నాడు దానాలు చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది విశ్వాసం ఉంది.
ఈ రోజున తమ పూర్వీకులకు వారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి, వారి ఆత్మ సంతృప్తి కోసం ప్రయత్నిస్తారు. దానాలు చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంద హిందువులకు నమ్మకం.
చెయ్యకూడనివి :
- 1.స్నానం తర్వాత సూర్య అర్జయం ఇవ్వడం అసలు మర్చిపోకూడదు.మీరు స్నానం చేసే వరకు మౌనంగా ఉండండి.
- 2.అమావాస్య రాత్రి సమయంలో దుష్ట ఆత్మలు చాలా చురుకుగా ఉంటాయని ఈ కారణంగా మీరు స్మశాన వాటిక చుట్టు తిరగడం మంచిది కాదని పెద్దలు చెప్తారు.
- 3.అమావాస్య రోజున ఇంట్లో ప్రశాంత వాతావరణము ఉండడం మంచిది. ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల పితృదేవతల అనుగ్రహం ఉండదు.
- 4.ఈ రోజున మద్యపానం, మాంసాహారం లాంటివాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది.
- 5.అమావాస్య రోజు స్త్రీ పురుషులు ఇద్దరూ దూరంగా ఉండడమే మంచిది.
చెయ్యాల్సినవి :
- 1.ధాన్యం : ధాన్యాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఇహ లోక యాత్రలో ఈ ఆహారాన్ని పొందుతారని హిందూ మత విశ్వాసం.
- 2.ఆవుపాలు : ఆవు పాలను దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. దేవతలు కూడా సంతోషిస్తారు.
- 3.ఆవనూనె : ఆవనూనెను దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందం లభిస్తుంది. దీనితో పాటు నువ్వులనూనె, అన్నం, జామకాయ దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
- 4.దుప్పటి : దుప్పటి దానం చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం తగ్గుతుంది. వారి వారసులు కూడా ఆశీర్వదిస్తారు.
- 5.పంచదార : పంచదార దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటి ఆర్థిక సమస్యలు తీరుతాయి.
- 6.దక్షిణ : బ్రాహ్మణులకు తన శక్తీ మేరకు దక్షిణ దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై వారి వారసులకు సంపదలు ప్రసాదిస్తారు.