ప్రజా పాలన – 6 గారెంటీ ల అమలు కోసం ఇంటింటి సర్వే

website 6tvnews template 11 ప్రజా పాలన - 6 గారెంటీ ల అమలు కోసం ఇంటింటి సర్వే

రేవంత్ సర్కార్ తమ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. మిగిలిన గ్యారెంటీల అమలుకు ఇంటింటి సర్వే చెయ్యాలని నిర్ణయించింది. 200 యూనిట్ల విద్యుత్, రూ.500 కే సిలిండర్, మహిళలకు రూ.2,500 పథకాల అమలు తో పాటు వివిధ రకాల పధకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని కోరింది.

త్వరలోనే సంబంధిత ప్రభుత్వ సిబ్బంది దరఖాస్తు ఫారాలతో ఇంటింటి సర్వే మొదలు పెట్టనున్నారని చెప్పింది. దీనికి సంబందించి అన్ని డాక్యుమెంట్స్ తమ వద్ద ఉంచుకోవాలని కోరింది. అయితే సర్వే ఎప్పటి నుంచి అనేది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది

APPLY FOR 6 GAURANTEES: Essential Documents to Prepare

  1. మహాలక్ష్మి పధకం కోసం అయితే వారి వద్ద ఆధార కార్డు వారి వెంట ఉంచుకోవాలి
  2. రూ.500 సబ్సీడీ గ్యాస్ సిలిండర్ కోసం అయితే – గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.
  3. రైతు భరోసా కోసం అయితే – లబ్ది పొందే వ్యక్తి రైతా, కౌలు రైతా టిక్ చేసి.. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.
  4. ఇందిరమ్మ ఇండ్లు కోసం అయితే – ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందినవాళ్లయితే.. పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్
  5. వేయాలి. ఒకవేళ ఉద్యమకారులైతే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
  6. గృహ జ్యోతి పథకం కోసం అయితే – నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది. దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి.
  7. చేయూత పథకం కోసం అయితే – దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి లేదా.. వాళ్లు వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అన్ని అయ్యాక కింద.. దరఖాస్తు దారుని పేరు, సంతకం, తేదీ వేయాలి.

ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును మీ ఇంటి వద్ద కు వచ్చిన అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

Leave a Comment