భాగ్య నగర్ కి కిరీటం లాంటిది డబుల్ డెక్కర్ కారిడార్ – CM రేవంత్

101426232 భాగ్య నగర్ కి కిరీటం లాంటిది డబుల్ డెక్కర్ కారిడార్ - CM రేవంత్

జంట నగర ప్రజల తో పాటు ఉత్తర తెలంగాణా లో ఉండే 5 జిల్లాల ప్రజలకు, అలాగే వానదారులకు దాదాపు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే. దీనికోసం ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం కావలసిన అన్ని ప్రణాలికలు సిద్దం చేసింది. నేషనల్ హైవె – 44 పై కొన్ని శతాబ్దాలు గా ఎదుర్కొంటున్న వాహన దారుల కష్టాలు పోయినట్లే. దీనికోసం 1,580 కోటల రూపాయలు తో 5.320 కిలోమీటర్లు కారిడార్ నిర్మాణానికి ఈరోజు CM రేవంత్ రెడ్డి శంఖు స్దాపన చేయనున్నారు.

తదనంతరం ఈ కారిడార్ పై మెట్రో మార్గం వచ్చేల కృషి చేస్తామని అందుకు తగ్గట్లు గానే నిర్మాణాలు చేపడుతున్నాం అని ఆయన చెప్పారు. నగరం లో హైదరాబాద్, సికింద్రబాద్, మేడ్చల్ – మల్కాజ్ గిరి, మెదక్, కామారేడి, నిర్మల్ – ఆదిలాబాద్ మీదుగా పోయే NH – 44 పైన జంట నగరాలతో పాటు విపరీతమైన ట్రాఫిక్ తో నగర ప్రజలు తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయానికులు రోజు ఎన్నో అవస్డలు పడుతుండటం కామన్ అయిపొయింది.

ఇప్పుడు ఈ మార్గం లో రహదాని విస్తరణ కూడా జరగడం తో దాదాపు ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. నగరం లోని కొన్ని ప్రాంతాలలో రహదారి విస్తరణ కు హై వె కు కలిసి రహదారుల విస్తరణ కు అనుమతులు ఇవ్వవలసింది గా ఆయన రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కోరారు. ఈ మేరకు అన్ని అనుమతులు వచ్చినట్లు CM రేవంత్ రెడ్డి చెప్పారు

ఎలివేటెడ్ కారిడార్ ప్రయోజనాలు:

నగరం లో ఇరుకైన రోడ్లు అలాగే ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం పోవడం తో దాదాపు అన్ని ప్రాంతాలలో వాహన దారులు చాల ఇబ్బందులు పడుతున్నారు. అంతే కొంత మంది రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు పోవడమో లేక కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం ఇలాంటి సంఘటనలు నిత్య కృత్యం అయ్యాయి.

వాహన దారులు అత్యవసర సమయాలలో వారు చేరుకోవలనుకొన్న గమ్యాన్ని కుడా చేరుకోలేక పోతున్నారు. అంతే కాదు ఒక్కక్కసారి గంటల కొద్ది వాహనాలు నిలిచిపోవడం వాహన దారులు ఎంతో ఇంధనాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ కారిడార్ వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చు. సమయం కల్సివస్తుంది. ఇంధనం కూడా అదా అవుతుంది

కారిడార్ నిర్మాణ వివరాలు :

మొత్తం కారిడార్ ఉండే పొడవు: 5.320 కి.మీ.
ఎలివేటెడ్ కారిడార్ ఉండే పొడవు: 4.650 కి.మీ.
అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం : 0.600 కి.మీ.
పియర్స్ వివరాలు : 131
సేకరణకు అవసరమైన భూమి : 73.16 ఎకరాలు
రక్షణ శాఖ ఇచ్చిన భూమి: 55.85 ఎకరాలు
సేకరించిన ప్రైవేట్ ల్యాండ్‌ : 8.41 ఎకరాలు
అండర్‌గ్రౌండ్ టన్నెల్‌కు నిర్మాణం : 8.90 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం అంచనా : రూ.1,580 కోట్లు

ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలు:

జాతీయ రహదారి -44 తో పాటు హైదరాబాద్ – సికింద్రాబాద్‌ తో పాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల వెళ్ళే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఆదిలాబాద్‌ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం ఏర్పడుతుంది. ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చు.ఇంధనం మిగులుతో వాహననదారులకు తగ్గనున్న వ్యయం, ఇంధన పొడుపు తో మరింత దూరం ప్రయాణం కాని, సిటీ రావడానికి గాని తొందర గ చేరుకునే అవకాశం దొరుకుతుంది. నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం ఎక్కుఅవ, ఇక్కడ కూడా వాహన దారులకు సమయం కలసివస్తుంది.

మేడ్చల్-మల్కాజిగిరి-మెదక్‌-కామారెడ్డి-నిజామాబాద్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌కు ప్రయాణికుల, సరకు రవాణా చేరవేత వేగంగా సాగుతుంది. దీని వల్ల మరింత సరుకులు ఎగుమతి దిగిమతి చేస్కోవడానికి సులభం గా ఉంటుంది.

Leave a Comment