Dress code for PuriJagannath Temple: భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారినిదర్శించుకుంటారు.
అయితే ఇక మీదట జగన్నాధ స్వామిని దర్శించుకోవాలంటే భక్తులు తమ వస్త్ర ధారణ కి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను పాటించి తీరాల్సిందే అంటున్నారు ఆలయ అధికారులు.
పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకునే భక్తులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ఉండాల్సిందే అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయానికి వచ్చే వారు సగం ఫాంటులు,
షార్ట్ లు(Shorts), జీన్సులు(Jeans Cloths), స్లీవ్ లెస్(Sleave Less) అంటే చేతులు లేని పై వస్త్రాలు ధరించి రావడానికి అనుమతి ఉండదని అంటున్నారు.
ఈ 12వ శతాబ్దపు ఆలయంలోని వచ్చే భక్తులు కొత్త నియమాలు అమల్లోకి వచ్చాక పురుషులైతే ధోతిలు ధరించి రావాలని తెలుస్తోంది.
ప్లాస్టిక్ సంచులు తెస్తే అంతే సంగతి : No Plastic Covers Allowed
జగన్నాధ ఆలయ పరిపాలన విభాగం కూడా ఈ డ్రస్ కోడ్ అమలు విషయంలో నడుం బిగించింది. ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ విషయంలో అవగాహనా కల్పించే బాధ్యతను ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే హోటల్ యాజమాన్యాలకు కూడా అప్పగించింది.
ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ వివరాలు చెప్పాలని సూచించింది. దీనితోపాటు మరో ముఖ్యన రెండు విషయాల్లో కూడా ఆలయ పరిపాలన విభాగం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఆలయ ప్రాంగణంలోగాని, ఆలయం లోపల గాని గుట్కా, పాన్ పరాగ్ వంటివి నమలడం నిషేధమని చెప్పింది, అలాగే ఆలయానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్లు(Plastic Covers),
ప్లాస్టిక్ వస్తులులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాసిద్దని చెబుతోంది. ఇక జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి తోపాటు వారి తోబుట్టువులు కొలువైయున్న
ఈ ఆలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆలయ అధికారులు పటిష్టమైన భద్రతా(Strong security) ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ ఆలయంలో సిసి కెమెరాలు (CC Cameras), పబ్లిక్ అనౌన్స్ మెంట్లను కూడా అందుబాటులో ఉంచారు.