Drinking Water Problems for Twin Cities in Summer : ఇంకా వేసవి కాలం మొదలు కాలేదు అప్పుడే తెలంగాణా జలవనరుల సంస్ధ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సారి వేసవి కాలం లో సాగు నీరు కే కాదు తాగు నీరు కి చాల ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ ఒక భయంకర మైన వార్త చెప్పింది.
దీనికి కారణం శ్రీశైలం జలాశయం లో నీళ్ళు పూర్తిగా అడుగంతుపోయాయని చెప్పింది. ఎన్నడు లేని విధం గ 10 ఏళ్ల లో ఎప్పుడు లేని విధం గ ఫిబ్రవరి లో నే నీళ్ళు డేడ్ స్టోరేజ్ కి పడిపోయాయి అని తెలిపింది. దీంతో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ క్రింద పంటలని సాగు చేసేవారికి నీళ్ళు ఉండక పోవచ్చు అని చెప్పారు.
శ్రీశైలం జలాశయం నీటి మట్టం 819 అడుగులు, ఇప్పుడు దీనిలో ఉన్నది 40 TMC నీళ్ళ లో కేవలం 10 TMC నీళ్ళు మాత్రమే పంట సాగు కి అవకాశం ఉంది, దీంతో రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ప్రతి సారి వేసవి లో నీళ్ఆళు విరి గా 158 క్యూసెక్కులు వెళ్ళి పోవడం జరుగుతుంది.
సంవత్సరం లో 5 నెలలు ఇలాగే ఉంటుంది. అటు ఆంద్ర ఇటు తెలంగాణా రాష్ట్రాల రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం జంట నగరాలకు సాగర్ నుండి అందుతోంది. ఇప్పుడు సాగర్ జలాశయం లో నీటి నిల్వలు పడిపోవడం తో ఈ సారి వేసవి లో నీటి కొరత చాల తీవ్రం గా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
జంట నగరాల ప్రజలే కాకుండా తెలంగాణా ప్రజలు నీళ్ళ విషయం లో ఇప్పటినుండి జాగ్రత్త లు తీసుకోవాలని, నీరుని పొడుపు గా వాడుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే వేసవి లో తాగడానికి కూడా నీళ్ళు దొరకవని అధికారులు తీవ్రం హెచ్చరిస్తున్నారు.