Dunki, Salar will be shocked If Mohanlal comes “straight” : మోహన్ లాల్ “నేరు”గా వస్తే – డుంకీ సాలార్ లకు షాక్ తప్పదా.

ezgif 4 efbc4ac346 Dunki, Salar will be shocked If Mohanlal comes "straight" : మోహన్ లాల్ "నేరు"గా వస్తే - డుంకీ సాలార్ లకు షాక్ తప్పదా.

Dunki, Salar will be shocked If Mohanlal comes “straight” : మోహన్ లాల్ “నేరు”గా వస్తే – డుంకీ, సాలార్ లకు షాక్ తప్పదా.

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ కధానాయకుడిగా రూపొందుతున్న సినిమా సాలార్, ఈ సినిమాలో కమల్ హస్సన్ గారాల పట్టి స్రుతి హస్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి తరువాత ప్రభాస్ కి తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా అభిమానులు పెరిగిపోయారు. పైగా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాకి కన్నడ నాట కూడా మంచి క్రేజ్ ఉంటుందని సినిమా నిర్మాతలు ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాను డిసెంబర్ 22 న రిలీజ్ చేయనున్నారు.

ఇక ప్రభాస్ తోపాటు అదే రోజున కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా తన కొత్త సినిమా డుంకీ తో థియేటర్లలో సందడి చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సి పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

పఠాన్, జవాన్ సినిమాలు దక్షిణాదిలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంలో షారుక్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే వీరిద్దరికి మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ చిన్న షాక్ ఇచ్చాడు.

తన కొత్త సినిమాను వీటికి పోటీగా బరిలోకి దింపాడు. ఈ రెండు సినిమాల కన్నా ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 21 వతేదీన తానూ నటించిన నేరు సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ నేరు కు దర్శకత్వం వహించారు.

అయితే వీరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. వాటిలో దృశ్యం, దృశ్యం 2 బాగా అడగా, 12థ్ మాన్ మాత్రం సోసో గానే వెళ్ళింది.

నిజానికి కేరళలో ప్రభాస్ షారుక్ లకు ఒకప్పుడు అంత క్రేజ్ లేదనే చెప్పాలి, అక్కడ బాగా క్రేజ్ ఉన్న ఇతర భాషా నటుడు ఎవరు అంటే అల్లు అర్జున్ పేరు చెప్పొచ్చు. అక్కడ అతని సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. పైగా అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుస్తారు కూడా.

ఇక కెజిఎఫ్ తో ప్రశాంత్ నీల్ కి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని ప్రభాస్ మలయాళంలో కూడా పాగా వెయ్యాలని చూస్తున్నాడు.

షారుక్ అయితే పఠాన్, జవాన్ సినిమాలతో డీసెంట్ కలెక్షన్లు రాబట్టాడు. ముఖ్యంగా జవాన్ సినిమాను డైరెక్ట్ చేసింది అట్లీ, నాయిక నయన్ తార, విజయ్ సేతుపతి, ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించారు.

దక్షిణాది నటులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను మలయాళీలు ఆదరించారు. ఈ డిసెంబర్ లో ఆ పప్పులేవి ఉదకకపోవచ్చు. కేరళలో క్రిస్టియన్ మతస్తులు అధికంగా ఉంటారు.

వారికి డిసెంబర్ నెలలో సెలవులు కూడా అధికమే, స్కూళ్లకు 10 రోజులు, ఆఫీసులకైతే వరం రోజులు ఇస్తారు.

మరి ఇలాంటి టైం లో మోహన్ లాల్ సినిమా వస్తే వదులుకుంటారా అందుకే వీరి సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందంటున్నాయి మలయాళీ సినీ వర్గాలు.

Leave a Comment