రవితేజ నటించిన ఈగల్ మూవీ – ఈ సారి పక్కా విజయం – ఫస్ట్ రివ్యూ : Eagle Movie First Review

website 6tvnews template 23 రవితేజ నటించిన ఈగల్ మూవీ - ఈ సారి పక్కా విజయం - ఫస్ట్ రివ్యూ : Eagle Movie First Review

Eagle Movie First Review : రవితేజ నటించిన ఈగల్ మూవీ మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 13 విడుదలవుతుందని ముందుగా అనుకున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మికం గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మొదట 13 న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు, అయితే కొన్ని కారణాల వల్ల సినిమాని 3 రోజులు ముందు గానే అంటే ఫిబ్రవరి 9 రిలీజ్ చేయాలనీ నిర్ణయించామని చెప్పారు. సోమవారం రోజున హైద‌రాబాద్ లో ఈగ‌ల్ ప్రివ్యూ షో వేశారు.


ఈ ప్రివ్యూ షోకు రవితేజ తో పాటు డైరెక్ట‌ర్ కార్తీక్‌, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్లతో పాటు మ‌రికొంద‌రు సినిమా టీమ్ స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు చూసారు.

అయితే ఈగ‌ల్‌ ప్రివ్యూ చూసిన ర‌వితేజ ఫుల్ హ్యాపీగా క‌నిపించారు. ఈగ‌ల్ అవుట్‌పుట్ విష‌యంలో ఐ యామ్ సూప‌ర్ సాటిస్పైడ్ అంటూ కామెంట్స్ చెయ్యడం చూస్తే మూవీ ఘన విజయం అందుకుంటుందని పలువురు సినీ ప్రముఖులు అభినందించారు.

స్వీట్ అండ్ షార్ట్ గా సినిమా బాగుంద‌ని ర‌వితేజ ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాత‌లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యొక్క అఫీషియ‌ల్ ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) అకౌంట్ లో పంచుకున్నారు. ర‌వితేజ సినిమా ప‌ట్ల ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

image 174 రవితేజ నటించిన ఈగల్ మూవీ - ఈ సారి పక్కా విజయం - ఫస్ట్ రివ్యూ : Eagle Movie First Review

అలాగే సినిమా చూసిన మిలిగిన వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించార‌ట‌. ర‌వితేజ‌కు హిట్ ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రి ఈగ‌ల్ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Comment