Eagle Movie Release date: మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)హీరోగా లేటెస్టుగా నటించిన మూవీ ‘ఈగల్’ (Eagle). కార్తిక్ ఘట్టమనేని ( karthik ghattamaneni)డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు.
అయితే మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో బాగా అప్సెట్ అయ్యారు. ముందుగా అనుకున్న తేదీకి ఈ మూవీని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ తాజాగా అనౌన్స్ కూడా చేశారు.
ఈ క్రమంలో కొత్త రిలీజ్ డేట్ ను కూడా తాజాగా చిత్రబృందం ఓ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ ట్విటర్ వేదికగా పోష్ షేర్ చేసింది. “బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.
మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ (Eagle)ను Februaryకి తీసుకొచ్చాం. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు అందరూ చూడాల్సిన మూవీని ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాలి.
అదేవిధంగా డైరెక్టర్, మూవీ టీమ్ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక కావాలి. అందుకే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం “అని ట్వీట్ ద్వారా ఫిబ్రవరి 9న రవితేజ ‘ఈగల్’ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥
— People Media Factory (@peoplemediafcy) January 5, 2024
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥
మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎
Now, EAGLE 🦅 takes flight for a global release in Telugu & Hindi on FEB 9th, 2024! 💥🔥… pic.twitter.com/VD20y8aAL2
Dil Raju about Eagle : ఈగల్ గురించి దిల్ రాజు ఏమన్నారంటే
సోషల్ మీడియాలో ఈగల్ (Eagle) మూవీ గురిచంచి దిల్ రాజు (Dil Raju) గురించి వస్తున్న వార్తలపై తాజాగా దిల్ రాజు స్పందించారు. ఈ అంశాలపై మీడితో ఆయన మాట్లాడూ..
“సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి. సంక్రాంతికి సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన నిర్మాతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాము.
ఒక మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయితే ఏదో జరిగినట్టు కాదు. గత సంవత్సరం మూడు సినిమాలకే ఓ రేంజ్ లో రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు 5 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.
నిర్మాతలమంతా కలిసి ఒక డెసిజన్ తీసుకున్నాం. సినీ ఇండస్ట్రీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐదు సినిమాల ప్రొడ్యూజర్లతో కలిసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce),
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telangana Statr Film Chamber Of Commerce), తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (Telugu Film Producers council)చర్చించాయి.
మరీ ముఖ్యంగా రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు. ఇదొక ఇండస్ట్రీలో చాలా మంచి పరిణామం” అని దిల్ రాజు తెలిపారు.
Solo release of ‘Eagle’ : సోలోగా ‘ఈగల్’ రిలీజ్
ఈగల్ (Eagle) సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే మరో రెండు సినిమాలు ఆ విడుదల తేదీని ప్రకటించాయి.
ఆ రెండు సినిమాల నిర్మాతలతో కూడా ప్రొడ్యూజర్ల టీమ్ చర్చలు జరిపింది. వాళ్లని ఒప్పించి.. ఫిబ్రవరి 9న ఈగల్ వచ్చేలాగా గట్టి ప్రయత్నాలు చేస్తోంట.
ప్రొడ్యూజర్ నాగవంశీ మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Karam)సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి ఆయన వెంటనే డీజే టిల్లు 2 (DJ Tillu)ను వాయిదా వేయడానికి అంగీకరించారు.
మరొక చిత్రం ‘యాత్ర 2’ (Yatra2) ఉంది. దాని నిర్మాతతో ఇంకా చర్చలు జరపలేదు. ఆయనతో కూడా మాట్లాడి ఆ సినిమాను ఇంకొక వారం ముందు అయినా,
తరువాత అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. వీరందరి అంగీకారంతోనే ఇప్పుడు ఈగల్ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసి మొత్తానికి ఫిబ్రవరిలో సోలోగా బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు.