Earthquake in china: చైనా లో భూకంపం..దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలు.

Add a heading 2023 12 20T112618.358 Earthquake in china: చైనా లో భూకంపం..దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలు.

Earthquake in china : చైనా లో భూకంపం..దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలు.

చైనా లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా వందకి మించి ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి.

వాయువ్య చైనాలో ఉన్న పర్వత ప్రాంతాన్ని రాత్రి సమయంలో ఆకస్మికంగా తలెత్తిన భూకంపం పట్టి కుదిపేసింది, గడిచిన 9 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో భూకంపాలు సంభవించినప్పటికీ ఈ సారి మాత్రం అత్యంత బలమైన భూకంపం సంభవించింది.

ఈ దారుణమైన భూ ప్రకంపనల ధాటికి మొత్తం 127 మంది మరణించారు అని చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక అధికారులు డిసెంబర్ 19వ తేదీ నుండి కూలి పోయిన ఇళ్లను జల్లెడ పట్టడం మొదలు పెట్టారు.

పైగా ఈ డిసెంబర్ నెలలో చలి తీవ్రత అధికంగానే ఉంటుంది. గడ్డ కట్టే చలి కాకపోయినప్పటికీ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలంటి సమయంలో నివాసితులను వారు విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.

According to Chinese reports, the magnitude of the earthquake was 6.2:

Add a heading 2023 12 20T112941.859 Earthquake in china: చైనా లో భూకంపం..దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలు.

కొన్ని నివేదికల ప్రకారం చుస్తే అక్కడ సంభవించిన భూకంపం తీవ్రత 6.2 గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూకంపం తాకిడికి దాదాపుగా 700 మంది పైనే గాయాలపాలయ్యారని సమాచారం అందుతోంది.

ఈ భూకంపం గన్సు , కింగ్‌హై ప్రావిన్సు ప్రాంతాల్లోని రహదారులను బాగానే దెబ్బతీసింది. ఎన్నియో భవనాలను నేలమట్టం చేసింది.

ప్రచటానికైతే భూకంపం వల్ల నిరాశ్రయులైన వారికి సహాయకచర్యలు అందించడం లో అధికారయంత్రాంగం పరుగులు పెడుతోంది, అయితే పూర్తిగా ధ్వంశం అయిపోయిన విద్యుత్ కమ్యూనికేషన్ రంగాల పునరుర్ధారణ పనులను కూడా త్వరలోనే చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

Mechanism for taking relief measures:

భూకంపం ధాటికి కొండ చరియలు విరిగి గృహసముదాయాలు, భవనాలు, చిన్న చిన్న ఇళ్ల ను ధ్వంసం చేశాయి. దీంతో అనేకమంది గాయాల పాలయ్యారు, ఇంకొంత మంది ప్రాణాలను రక్షించుకునే క్రమం లో సొంత కుటుంబ సభ్యులకు దూరమయ్యారు.

కమ్యూనికేషన్ దెబ్బతినడంతో తమ వారిని చేరుకునే సౌలభ్యం కనిపించడం లేదు. పైగా శీతాకాలం కావడంతో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల వారంతా కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిన గుడారాలలో తలదాచుకోవడానికి కదలక తప్పలేదు.

ప్రభుత్వం ఈ తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించే వరకు కూడా నిరాశ్రయులు వ్యవసాయ భూమిలోనే ఉన్నారట. కొందరు చలిని తట్టుకోలేక రాత్రి సమయంలో నిప్పును రగిలించి చలికాగుతూ ఉన్నారని తెలుస్తోంది.

తరువాతి రోజు మధ్యాహ్నం వారి వద్దకు అధికార యంత్రాంగం వచ్చి వారిని సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు తరలించింది. అక్కడ వారిని
తినడానికి ఆహరం తోపాటు చలి నుండి తట్టుకోవడానికి దుప్పట్లు చలి దుస్తులు అందజేసింది.

According to US Geology, the magnitude of the earthquake was 5.8:

Add a heading 2023 12 20T113305.528 Earthquake in china: చైనా లో భూకంపం..దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలు.

ఈ భూకంప కేంద్రం విషయానికి వస్తే ఇది క్వింఘై అనే ప్రాంత సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల దూరంలోని జిషిషన్ కౌంటీలో 6 మైళ్ళ లోతులో ఈ భూకంపం సంభవించిందని ఆదేశపు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అయితే యుఎస్ జియోలాజికల్ సర్వ్ నివేదికలు మాత్రం మరోలా ఉన్నాయి. చైనా నివేదిక ప్రకారం చుస్తే భూకంపం తీవ్రత 6.2 గా ఉంది అయితే యుఎస్ నీవేక చుస్తే ఇది 5.9 గా నమోదైంది.

Leave a Comment