Tsunami In japan 7.6 Magnitude: జపాన్ లో భూకంపం.

Earthquake in Japan

Tsunami In japan 7.6 Magnitude: కొత్త ఏడాది జనవరి ఒకటవ తేదీనాడే జపాన్(Japan) దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నూతనసంవత్సరం రోజునే అక్కడ ఒక భారీ ఉపద్రవం సంభవించింది.

ఈ భూకంపం తీవ్రత కూడా అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర మధ్య జపాన్ లో స,భావించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కెలు పై 7.6గా నమోదైనట్టు తెలుస్తోంది.

కేవలం ఇది భూకంపం తో మాత్రమే ఆగకుండా సునామి కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెచ్చరిస్తున్నారు. ఇషికావా(Ishikawa), నీగాటా(Niigata),

టొయామా ప్రిఫెక్చర్ల(Toyama prefecture) ప్రాంతాలకి ఈ సునామి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సునామి హెచ్చరిక ఏ ప్రాంతానికి అంటే : Tsunami warning for which area?

ఆయా తీరాలలో సముద్రపు అలలు ఒక మీటరు నుండి ఐదు మీటర్ల వరకు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఐదు మీటర్లు ఎత్తు అంటే సుమారుగా అది 16 అడుగుల ఎత్తు వరకు ఉండవచ్చని అంటున్నారు. కాబట్టి సముద్ర తీరా ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

సముద్ర తీరానికి దూరంగా ఏదైనా ఎత్తుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటే ప్రమాదం నుండి దూరంగా ఉండగలుగుతారని చెబుతున్నారు.

ఈ ప్రక్రుతి విపత్తు కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక భూకంపం సంభవించిన సమయంలో వీడియోలు తీసిన వారు వాటిని సామజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు. భూ ప్రకంపనలు చోటుచేసుకున్న సమయంలో రైల్వే స్టేషన్లలో ఉండే అనౌన్స్ మెంట్ బోర్డులు ఊగిపోతు కనిపించాయి వీడియోలలో.

ఏడు సార్లు భూకంపం : Earth Quake For Seven Times

ఇక భూకంపాల విషయానికి వస్తే జపాన్ లోని ప్రధాన ద్వీపమైన హోన్షు(Honshu) సముద్రానికి చేరువలో ఉన్న నోటో(Noto) అనే ప్రదేశంలో ఇప్పటివరకు 7 సార్లు భూకంపం సంభవించినట్టు అధికారుల ద్వారా తెలుస్తోంది.

ఒకే సారి ఒకే రోజు యేడు దఫాలుగా భూమి కంపించడంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

Leave a Comment