
Earthquake In Sri Lanka of magnitude 6.2 struck : భయాందోళనలో ప్రజలు..నష్టం వివరాలు అందలేదన్న అధికారులు..లంక రాజదాహాని కొలంబోలో ప్రకంపనలు
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం సంభవించింది, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల .31 నిమిషాల సమయంలో ఈ భూకంపం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన ప్రకారం రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2 గా నమోదైనట్టు తెలుస్తోంది. భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు భయకంపితులై ఇళ్ల నుండి ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు.
ఇది ఇలా ఉంటె గత రెండు రోజులుగా దక్షిణ సూడాన్, ఉంగాడా, తజికిస్థాన్, తైమూర్, ఇండోనేషియా తదితర దేశాల్లో భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఇక లంకలోని భూకంపం విషయానికి వస్తే భూకంపం కొలంబో కి ఆగ్నేయంగా 1,326 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు ఎన్‌సీఎస్ తెలిపింది.
అయితే, ఇప్పటి వరకూ భూకంప నష్టం గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదని పేర్కొంది. అయితే ఈ భూకంపం సముద్రంలో సంభవిచడంతో సునామి ప్రమాదం పొంచి ఉందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది.
జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో మాత్రం శ్రీలంకలో సంభవించిన భూకంపం వల్ల తక్షణమే ముప్పు లేదని చెబుతోంది. హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది.