10 నిముషాల వ్యవధి లో మహారాష్ట్ర లో రెండు సార్లు భూకంపం !

bumalarza962018 10 నిముషాల వ్యవధి లో మహారాష్ట్ర లో రెండు సార్లు భూకంపం !

మహారాష్ట్రలోని హింగోలి నగరంలో ఈ గురువారం తెల్లవారుజామున కేవలం 10 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి సారి వచ్చినపుడు రిక్టర్ స్కేల్‌పై 4.5 మరియు 3.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు. భూకంపం వచ్చిన ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రెండవ సారి వచ్చినపుడు రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చినట్లు తెలియచేసారు.

ఉదయం 06.08 గంటలకు 10 కి.మీ లోతులో వచ్చినట్లు గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ కి సంబందిచిన అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇప్పటివరకు ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు మా దృష్టికి రాలేదని అధికారులు చెప్పారు.

Leave a Comment