దేశ చరిత్ర లోనే CM ని అరెస్ట్ చెయ్యడం మొదటి సారి ! కవిత తో లింక్ ఏంటి ?

website 6tvnews template 2024 03 22T114017.184 దేశ చరిత్ర లోనే CM ని అరెస్ట్ చెయ్యడం మొదటి సారి ! కవిత తో లింక్ ఏంటి ?

నిన్న డిల్లి CM అరవింద్ కేజ్రివాల్ ని అది ముఖ్యమంత్రి సీటు లో ఉన్న వ్యక్తిని ED అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ మద్యం కుంభకోణం సంబందించిన అరెస్ట్ అని ED తెలిపింది. ఇప్పటి వరకు ఈ కుంభకోణం కి సంబందించి 16 మందిని అరెస్ట్ చేసినట్లు ED అధికారులు చెప్పారు. అంతకు ముందు BRS పార్టీ నాయకురాలు కవితను అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈ పరిణామాల అనతరం డిల్లి ముఖ్యమంత్రి ఈ అరెస్ట్ నుండి ఎలాగైనా బయట పడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. చివరకు హై కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. నిన్న రాత్రి ED అధికారులు 7 గంటలకు CM ఇంటికి వెళ్ళి 2 గంటలు విచారణ చేసి అక్కడే ఆయనను అరెస్ట్ చెయ్యడం జరిగింది.

ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యడం బహుసా దేశ చరిత్ర లో ఇదే మొదటి సారి. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యలేదని ED అధికారులు చెప్తున్నారు. కాని ఇంతకు ముందు ఝార్ఖండ్ ముఖ్యంత్రి సోరెన్ ను ED అరెస్ట్ చెయ్యడం జరిగింది. కాని ఆయన మీద ఆరోపణలు కారణం గా ఆయన తన పదవికి రాజీనామా చేసారు.

నిన్న రాత్రి అరెస్ట్ అనంతరం ED ఆఫీస్ లో ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ED అధికారులు తెలిపారు. అయితే ఆయనను శుక్రవారం నాడు రోస్ అవేన్యు లో హాజరుపరుస్తామని అధికార్లు చెప్పారు. అనంతరం కేజ్రివాల్ ను రిమాండ్ కి తరలించామని కోరే అవకాశం ఉంది .ఇప్పటికే కేజ్రివాల్ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు లో పిటీషన్ వేసినట్లు చెప్పారు. ఈ అరెస్ట్ మీద తక్షణం న్యాయ విచారణ జరపాలని వారు కోరారు. ఇదే కేసు మీద ఉప ముఖ్యమంత్రి సిసోడియాను కూడా అరెస్ట్ చేసింది ED.

Leave a Comment