త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు – కేంద్ర మంత్రి సూచన.

website 6tvnews template 2024 02 26T142608.699 త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు - కేంద్ర మంత్రి సూచన.

educe petrol,diesel rates in shortly – central ptroleum minister : ఎప్పటికప్పుడు దేశం లో పెట్రోల్, డీజిల్ రెట్లు తగ్గుతాయని ఉహాగానాలు వస్తున్నాయి. మే 22, 2022 సంవత్సరం నుండి పెట్రోల్,డీజిల్ రెట్లలో ఎటువంటి మార్పు లేదు. అయితే రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. నాలుగో క్వార్టర్ లో చమురు కంపెనీలు లాభాల్లో కి వచ్చినట్లయితే ఈ చమురు ధరలు కూడా తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దిప్ సింగ్ పూరి సూచనా ప్రాయంగా చెప్పారు

UN గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా 18 వ నేషనల్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ చమురు కంపెనీలు గత నష్టాల నుండి కోలుకున్నాయని, రాబోయే 3 వ క్వార్టర్ లో లాభాలు చూడగలమని ఆయని చెప్పారు. 4 క్వార్టర్ లో ఇంకా బాగుంటే ధరలను తగ్గించ వచ్చని ఆశిస్తున్నాం అని ఆయన అన్నారు.

IOCL – ఇండియన్ ఆయిల్ కోర్పోరేషన్, BPCL – భారత పెట్రోలియం కార్పోరేషన్, HPCL – హిందుస్దాన్ పెట్రోలియం కార్పోరేషన్ వంటి చమురు మార్కెటింగ్ సంస్దలు గత 3 క్వార్టర్స్ లోను మంచి లాభాలను గడించాయని ఆయన చెప్పారు. 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను 3 క్వార్టర్ లో ఈ 3 కంపెనీలు దాదాపు 11,773.83 కోట్ల లాభాన్ని గడించాయి. గత 3 క్వార్టర్స్ లలో ఈ 3 కంపెనీలు వారి లాభాలు 69,000 కోట్లను అధిగమించడం విశేషం. వీటిని దృష్టి లో పెట్టుకునే కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచన ప్రాయం గా చెప్పి ఉంటారని మీడియా వర్గాలతో పాటు పలువురు మార్కెటింగ్ నిపుణులు చెప్తున్నారు

Leave a Comment