Elon Musk: ట్విట్టర్(Twitter) అలియాస్ ఎక్స్(X) అధినేత ఎలాన్ మాస్క్(Elan musk) తనదైన చర్యలతో ఎల్లప్పుడు న్యూస్ లో హెడ్ లైన్స్ ఉంటుంటారు.
అది చాలదన్నట్టు అయన చేసే వ్యాఖ్యలు ఎక్స్ లో తాను వేసే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న దగ్గర నుండి కంపెనీలో అయన చేసిన మార్పుల నుండి కంపెనీ పేరు మార్చడం వరకు అనేక అంశాలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
పైగా ఎవరినైనా ఎద్దేవా చేయాలన్నా కూడా మాస్క్ తనదైన శైలిలో ట్వీట్లు చేసేవాడు. తాజాగా మాస్క్ ఎక్స్ లో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ సారి మాస్క్ పోస్ట్ పెట్టాడా కాదు, ఏకంగా తన బయో(Bio)లో లే చేంజెస్ చేశాడు. ఈ మార్పులు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది తెలియలేదు. అయితే ఆ మార్పులు ఏమిటన్నది చూద్దాం.
నెటిజన్ల చమత్కార బాణాలు : Netigens Satirical comments
ఎక్స్ అధినేత మాస్క్(Mask) తన బయోలో కొన్ని మార్పులు చేశాడు, అవి నెటిజన్లకు ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. బయో లో ఉన్న తన హోదాను సిటివో గా మార్చుకున్నారు.
అయితే సిటివో(CTO) అంటే అర్ధం కూడా వివరించాడు, సిటివో అంటే చీఫ్ ట్రోల్ ఆఫీసరట(Chief Troll Officer). పైగా తన లొకేషన్ ను కూడా చేంజ్ చేశాడు,
లొకేషన్ ను ట్రోల్ హీమ్ గా(TrollHeam) మార్చాడు. ట్రోల్ హీమ్ అనే పదానికి అర్ధం వీడియో గేమ్స్ ఆడవారికి బాగా తెలుస్తుంది. ట్రోల్ హీమ్ అంటే ఎత్తైన పర్వతం అని అర్ధం.
అయితే మాస్క్ బయో లో జరిగిన మార్పులపై నెటిజన్లు కూడా వెరైటీగా స్పందిస్తున్నారు. సీటీవోకి బదులు సీఎంవో(CMO) అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు. సీఎంవో అంటే చీఫ్ మీమ్స్ ఆఫీసర్(Chief Memes Officer) అని చెబుతున్నారు.