Election Voting: 2 శాతం ఓట్లకి 25 సీట్లా ?

25 seats for 2 percent votes?

Election Voting: 2 శాతం ఓట్లకి 25 సీట్లా ?

ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో చాలా విలువైంది. ఎన్నోసార్లు ఎన్నికల్లో ఇది రుజువయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడో, ప్రజలు మార్పు కోరుకున్నప్పుడో, ఓ అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నప్పుడో అధికారం చేతులు మారుతుంటుంది.

అయితే కొన్నిసార్లు గెలిచే పార్టీ వేవ్ కనపడుతుంటుంది. భారీగా సీట్లు, ఓట్లు సాధిస్తుంటుంది. క్లీన్ స్వీప్ చేసేస్తుంటుంది. గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి మధ్య భారీ తేడా ఉంటుంది. అయితే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో ఇది కనిపించలేదు.

కాంగ్రెస్ 64 స్థానాలు గెలిస్తే..బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుపొందింది. 25స్థానాలు ఎక్కువగెలుచుకుంది. సీట్ల సంగతి పక్కన పెడితే ఓట్ల విషయంలో కాంగ్రెస్ కు, బీఆర్ ఎస్ కు ఉన్న తేడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఓట్ల తేడా కేవలం 2శాతమే.

ఈ కొంచెం తేడాతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ చేతిలో విజయం సాధించింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఓట్లశాతం 39.39. బీఆర్ఎస్ ఓట్ల శాతం37.38శాతం. ఈ రెండు శాతం అధిక ఓట్లు కాంగ్రెస్ 25 స్థానాలు ఎక్కువ తెచ్చాయి.

అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 11శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది.

నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ప్రజల్లో ఎప్పుడూ సానుకూలభావనే ఉంది. బీఆర్ ఎస్ కు రెండుసార్లు అధికారం అప్పగించినా..కేసీఆర్ అంటే అపార అభిమానం కనబర్చినా, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పై కూడా కృతజ్ఞతా భావం ఉంది.

తెలంగాణ కోసం పోరాడడం, సాధించడంలో కేసీఆర్, టీఆర్ ఎస్ పాత్రను తెలంగాణ ప్రజలు ఏనాడూ తక్కువగా చూళ్లేదు. అదే సమయంలో 2009-2014 మధ్య ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొందో, ఎన్ని ఒత్తిళ్లను అధిగమించిందో….

ఎందరినీ బుజ్జగించి…అందరినీ ఓ తాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిందో…పదేళ్ల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకునే ఉన్నారు.

అందుకే తెలంగాణ తెచ్చిన పార్టీకి, సంక్షేమ పాలనకు గౌరవనీయమైన ప్రతిపక్ష హోదా కల్పిస్తూ…అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీకి కృతజ్ఞత చాటుకున్నారు. గెలుపుకు, ఓటమికి మధ్య రెండుశాతం ఓట్ల తేడా ఉండడాన్ని ఈ కోణంలో నుంచే చూడాలి.

ఇక ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం బీజేపీ సాధించిన ఓట్లు. బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందింది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ లాంటి అగ్ర నేతలు ఓడిపోయినప్పటికీ, ఈ ఎన్నికల్లో బీజపీకి 9 స్థానాలొచ్చాయి. 13.9శాతం ఓటింగ్ వచ్చింది.

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమితో పాటు బీజేపీ తెలంగాణలో బలపడిన తీరు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయింది. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో కాషాయజెండాను ప్రగతిభవన్ లో రెపరెపలాడిస్తానని పదే పదే చెప్తుండేవారు.

ఈ ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని బీజేపీ సాధించలేకపోయినప్పటికీ, 2018 ఎన్నికల్లో కేవలం ఒక్కచోట గెలిచిన బీజేపీ ఇప్పుడు వాటి సంఖ్యను 9కి పెంచుకోవడం సాధారణమైన విషయం కాదు.

అలాగే ఓట్ల శాతాన్ని 6.9శాతం నుంచి 13.9శాతానికి పెంచుకోవడం తెలంగాణలో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్నదానికి నిదర్శనం.ఓటింగ్, బండి సంజయ్, కాంగ్రెస్, బీజేపీ ఇక తగ్గేదేలే.

Add a heading 2023 12 05T115622.294 Election Voting: 2 శాతం ఓట్లకి 25 సీట్లా ?

తెలంగాణలో బీజేపీని 2018 ముందు.. తర్వాత అని చెప్పుకోవాలి. కొన్ని నెలల క్రితం వరకు అధికారంలోకి వస్తామని చెప్పుకున్న బీజేపీ కనీసం 10 సీట్లు గెలవలేకపోయిందని ఆ పార్టీపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అధికారం సంగతి..సీట్ల సంగతి పక్కన పెడితే, బీజేపీ ఈ ఎన్నికల్లో చూపిన ప్రభావాన్ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు.

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కమలం పార్టీ దూకుడుగా వెళ్లడం, ప్రతి అంశంలోనూ అధికార పార్టీని ఢీ అంటే ఢీ అనడం వంటివి చేసింది.

ఆ తర్వాత బండి సంజయ్ మార్పు, కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిని స్వీకరించడం వంటివి జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడే కొద్దీ బీజేపీలో పరిణామాలు చకచకా మారిపోయాయి. అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పరస్పర విమర్శలు తగ్గించుకున్నాయి.

కేటీఆర్ ఢిల్లీ వెళ్లివచ్చారు. కేసీఆర్ కేంద్రంపై విమర్శలు తగ్గించారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై మెతక వైఖరి ప్రదర్శించాయి. అంతకుముందున్న దూకుడుతనం లేకపోవడంతో కమలం శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. ఇదే వాతావరణం ఎన్నికల దాకా కొనసాగింది.

Add a heading 2023 12 05T123019.300 Election Voting: 2 శాతం ఓట్లకి 25 సీట్లా ?

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలేంటంటే, ఇంత నిరుత్సాహపూరిత వాతావరణంలోనూ, అధికారపక్షానికి మిత్రపక్షమా లేక ప్రతిపక్షమా అన్నది క్యాడర్ కు సైతం అర్ధం కాని సందిగ్ధస్థితిలోనూ బీజేపీ 8 సీట్లు గెలవడం. 19 స్థానాల్లో బీజేపీ రెండోస్థానంలో నిలవడం. ఓట్ షేరింగ్ ను 6.9శాతం నుంచి 13.9 శాతానికి పెంచుకోవడం.

ఇక గతంలోలా దూకుడుగా ఉండి ఉంటే..ప్రతి విషయంలోనూ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంటే బీజేపీ ఇంకెన్ని సీట్లు గెలుచుకుని ఉండేదో అంచనావేయొచ్చు.

అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీలో చర్చనీయాంశమవుతున్న మరో అంశం, కమలం పార్టీలో ప్రముఖులుగా ఉన్న వాళ్లు ఓడిపోవడం మరియు పెద్దగా గుర్తింపు లేని నేతలు గెలుపొందడం.

బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రఘునందన్ రావు వంటి నేతలంతా పరాజయం పాలయ్యారు. రాజాసింగ్ మాత్రం గోశామహల్ నుంచి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించగలిగారు.

కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు బీజేపీ సత్తాను చాటేదే. నిర్మల్, ఆర్మూర్, ముథోల్, నిజామాబాద్ అర్బన్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో కాషాయదళం గెలుపొందడం తెలంగాణలో బీజేపీ ఎవరూ ఊహించని స్థాయిలో విస్తరిస్తోందన్న విషయం నిరూపితమయింది.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పదే పదే బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటే అని బీఆర్ ఎస్ బీజేపీ బీ టీమ్ అని ప్రచారం చేసింది. ఆ లెక్కన అధికారపార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ల ఓట్లు బీజేపీకి పడలేదని భావించాలి.

అయినాసరే స్థానికత, జాతీయస్థాయిలో బీజేపీ ఛరిష్మా కలిసి కాషాయ అభ్యర్థులను 8 నియోజకవర్గాల్లో విజేతలుగా నిలిపాయి.జాతీయస్థాయిలో బీజేపీకి కాంగ్రెస్సే ప్రత్యర్థి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

రాష్ట్రంలో ఇక అధికారపక్షాన్ని బీజేపీ ఢీ అంటే ఢీ అంటుంది. రానున్న రోజుల్లో తెలంగాణపై బీజేపీ తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Comment