యావత్ భారత దేశం కేంద్ర ఎన్నికల సంఘం వైపే చూస్తోంది, కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఏ రోజు లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) అలాగే కొన్ని రాష్ట్రాల శాసనసభ(State Assembly Elections) ఎన్నికలకు సంబంధించిన తేదీ ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే ఒక ప్రకటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే దేశవ్యాప్తంగా ఏప్రియల్ 16వ తేదీ నుండి ఎన్నికలు అని. ఏప్రియల్ 16వ తేదీన లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్త వివరీతంగా ప్రచారంలోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించింది.
లోక్ సభ ఎన్నికల తేదీ ఏప్రియల్ 16 అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తమకు కొన్నీ ప్రముఖ న్యూస్ ఛానెళ్ల నుండి ఫోన్లు వస్తున్నాయని చెప్పింది. ఎన్నికల తేదీ 16 ఏప్రియల్ అనేది నిజమేనా అని వారిని అడిగారట. అయితే ఆ తేదీ ఎన్నికల తేదీ కాదని చెప్పమని అన్నారు.
ఇక ఏప్రియల్ 16 వ తేదీ అనేది ప్రచారంలోకి రావడం పట్ల ఒక కారణం ఉందని అన్నారు. ఏప్రియల్ 16వ తేదీ లోగా దేశ వ్యాప్తంగా ఉన్న సిబ్బంది, ఎన్నికలకు సంబంధించిన పనులను పూర్తిచేసుకోవడానికి ఇచ్చిన తుది గడువు అని వెల్లడించారు.
ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ ఆ తేదీ లోపే పూర్తి చేయాలట. ఈ మేరకు జనవరి 19వ తేదీన లేఖను కూడా జారి చేశారని పేర్కొన్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని అన్నారు.