రేపటి ఉప్పల్ స్టేడియం లో IPL మ్యాచ్ కు విద్యుత్ శాఖ షాక్

website 6tvnews template 2024 04 05T130555.998 రేపటి ఉప్పల్ స్టేడియం లో IPL మ్యాచ్ కు విద్యుత్ శాఖ షాక్

నగరం లో ఉన్న ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్టేడియం అంధకారంలో చిక్కుకుపోయింది. సుమారు రూ.3.4 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని అందుకనే కరెంట్ సరఫరాను నిలిపివేసామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. దీంతో స్టేడియం తో పాటు అక్కడ ఉన్న పరిసరాలు అన్ని చీకట్లో మగ్గుతున్నాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు.

IPL 2024 లో భాగంగా శుక్రవారం ఉప్పల్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడాల్సి ఉండగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల ఇప్పుడు జనరేటర్ల సహాయంతో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారని క్రికెట్ నిర్వాహకులు చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన ఎన్నో బిల్లులు చేల్లించక పోవడంతోనే కరెంట్ సరఫరాను నిలిపివేసామాని అధికారులు చెప్పారు. అంతే కాకుండా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కరెంటును యథావిధిగా వాడుకోవడం వల్ల ఇప్పుడు విద్యుత్ శాఖ హైదరాబాద్ క్రికెట్ సంఘం పై విద్యుత్ దొంగతనం కేసులు పెట్టింది.

దీంతో వెంటనే HCA కోర్టును అశ్రయించిడం జరిగింది. కోర్టు కుడా విద్యుత్ శాఖ అధికారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో డిఫాల్టర్‌గా ఉన్న HCA పెండింగ్ బిల్లును రూ.1.41 కోట్లతో పాటు రూ.1.64 కోట్లు సర్‌చార్జి కింద కలిపి మొత్తం రూ.3.05 కోట్లు వారం రోజుల్లోగా చెల్లించాలని ఇదివరకే డిసెంబర్ 6న కోర్టు నోటీసులు జారీ చెయ్యడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన HCA అధికారుల్లో చలనం రాకపోవడం తో ఇక వేరే దారి లేక అధికారులు విద్యుత్ సరఫరాను ఆపివేసినట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.

మ్యాచ్‌ను నేరుగా చూడడానికి వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు టికెట్లను కొనుగోలు చేశారని స్టేడియం అధికారులు చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని అభిమానులు వివిధ మార్గాల ద్వారా బ్లాక్‌లో రూ.5 వేల టికెట్‌ను రూ.10 నుంచి రూ.15 వేలకు కొన్నట్లు చెప్తున్నారు. వారంతా ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉన్నారని స్టేడియం అధికారులు చెప్పారు. మరి చూడాలి ఎం జరుగుతుందో.

Leave a Comment