అమెరికా తో కలిసి శత్రు సైన్యానిని చెక్ పెట్టడానికి ఎలాన్ మస్క్ సిద్ధం

104633824 GettyImages 494587915 అమెరికా తో కలిసి శత్రు సైన్యానిని చెక్ పెట్టడానికి ఎలాన్ మస్క్ సిద్ధం

ప్రపంచ కుబేరుడు స్పేస్ X అదినేత, టెస్లా CEO ఎలాన్ మస్క్ అమెరికా మిలిటరీ తో కలిసి పనిచెయ్యడానికి సిద్దం అయినట్లు వార్తలు అందుతున్నాయి.ఇప్పటికే ప్రపంచంలోనే పలు దేశాలకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తున్న ఆయన తాజాగా అమెరికా సైన్యానికి స్పేస్ X స్పై శాటిలైట్‌లను తయారు చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు అమెరికా సైనిక అవసరాల కోసం అధునాతన స్పై శాటిలైట్ లను అందించడానికి ప్రణాలికలు రెడీ చేసారు. దీనికి సంబందించి ఎలాన్ మస్క్ అమెరిక సైనిక విభాగాలు తో ఒక భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

స్పేస్ X స్ప్పై శాటిలైట్ల వల్ల ప్రయోజనం:

ఇక మీదట అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్దలు , అమెరికన్ ఆర్మీ నిర్వహించే పలు రకాల ప్రాజెక్ట్‌లలో స్పేస్‌ ఎక్స్‌ తయారు చేస్తున్న స్పై శాటిలైట్‌లు అంత్యంత కీలకం కానున్నాయి. ప్రపంచం లో ఉన్న అన్ని ప్రత్యర్ధి దేశాలు నిర్వహించే అణు పరీక్షలను ముందుగా గుర్తించడానికి వీలు పడుతుంది. అంతే కాకుండా పలు దేశాల సైనికుల పహారా ఎలా సాగుతోంది, బాంబుల తీవ్రత అలాగే బాంబుల వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసేందుకు,శత్రు దేశాల సామర్థ్యం తో పాటు వారికి సంబందించిన ఎటువంటి సమాచారం కావాలన్నా , ఎదుటి వారి ఎత్తుగడలు పసిగట్టడంలో ఈ స్పై శాటిలైట్‌లు చాలా బాగా పనిచేస్తాయి.

వారికీ ఎటువంటి సమాచారం కావాలన్న ఈ స్పై శాటిలైట్ లు అమెరికన్ ఇంటెలిజన్స్ కు వెంటనే సమాచారం చేరవేస్తాయి.ఈ భారీ ప్రణాలికలు అమెరికన్ మిలటరీని బలోపేతం చెయ్యడానికే ప్రయత్నిస్తున్నట్లు అమెరికన్ మిలటరీ వర్గాలు తెలిపాయి.ఎలాన్ మస్క్ చేపట్టిన ఈ స్పై స్పేస్ ప్రాజెక్ట్ సేక్సేస్ అయితే అమెరిక మిగిలిన ప్రపంచ దేశాలపై సైనిక కదిలకల తో పాటు వారు నిర్వహించే ఎలాంటి పరీక్షలు అయిన గుర్తించడానికి వీలు అవుతుంది.

Leave a Comment