Tesla Factory Coming to India: ఎలన్ మస్క్ టెస్లా నుంచి ఫస్ట్ ఫ్యాక్టరీ భారత్‌కు వస్తోంది.
గుజరాత్.. గత కొన్నేళ్లుగా వ్యాపారవ్యూహాలకి కీలకప్రదేశంగా మారింది.ఈ రాష్ట్రంలో ఇప్పటికే మారుతి సుజుకి లాంటి ఆటోమేకర్ల తయారీ యూనిట్లకు మూలప్రదేశంగా ఉంది.
ఇక్కడ ఉన్న సనంద్, బెచరాజీ మరియు ధోలేరా వంటి ప్రదేశాలు మాత్రమే టెస్లా కర్మాగారానికి సరైన ప్రదేశాలు.కాబట్టి ఈ గుజరాత్ లో ఎలోన్ మస్క్ యొక్క టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Tesla First Factory in Gujarat : గుజరాత్‌లో టెస్లా మొదటి ఫ్యాక్టరీ:
అహ్మదాబాద్ మిర్రర్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టెస్లా ప్లాంట్ భారతదేశంలో ప్రవేశించడానికి సన్నద్దమవుతుంది.
దీనికోసం గుజరాత్ లో తన మొదటి ప్లాంట్ స్థాపన చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది.
ఈ ఈవి మేకర్ యొక్క తయారీ యూనిట్ల స్థాపనకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి.
దీని గురించి గుజరాత్ రాష్ట్రంలో జనవరి 2024 లో వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో గుజరాత్ లో టెస్లా తయారీకి సంబందించిన ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఉన్న వర్గాల నుంచి సమాచారం.
2003 లో వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్: Vibrant Gujarat Global Summit in 2003:
2003 లో వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరిగినది.దీనికి 10 వ ఎడిషన్ గా 20 సంవత్సరాల ఆనంతరం, వైబ్రాంట్ గుజరాత్ ని విజయవంతమైన సమ్మిట్ గా జరుపుకుంటుంది.