‘ రాజాకార్ ‘ మూవీ నిర్మాత కు అత్యవసర CRPF పోలీసు భద్రత – కేంద్ర ప్రకటన

WhatsApp Image 2024 03 21 at 4.40.53 PM ' రాజాకార్ ' మూవీ నిర్మాత కు అత్యవసర CRPF పోలీసు భద్రత - కేంద్ర ప్రకటన

నిజాం కాలం నాటి సమయం లో హైదరాబాద్ లో జరిగిన హింసాత్మక సంఘటనల ఆధారం గా నిర్మించిన ” రాజాకార్ ” మూవీ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి కి తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంతే కాదు దగ్గర దగ్గర 1100 కాల్స్ బెదిరిస్తూ తనను రోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఆయన కంప్లైంట్ చెయ్యడం జరిగింది. దీనికి సంబందించిన అన్ని వివరాలతో కేంద్ర హోమ్ శాఖ కు కుడా ఫిర్యాదు చెయ్యడం తో వెంటనే స్పందిస్తూ కేంద్రం ఆయనకు 1+1 CRPF జవాన్లను ఆయన వ్యక్తిగత భద్రత కోసం కేంద్రం నియమించింది. అయితే కేంద్ర నిఘా సంస్దలు కూడా వెంటనే ఎంక్వయిరీ చేసి వారు కుడా నిర్దారించడం తో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఇది ఇలా ఉంటె యాటా సత్యనారాయణ డైరెక్షన్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన రాజాకార్ మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం సిని చరిత్ర లో సంచంలనం సృష్టించింది. అంతే కాదు ఈ మూవీ జబ్బర్ దస్త్ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్ర లో నటించారు. అయితే ఈ మూవీ గత సంవత్సరం ఎన్నికల ముందే రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసారు.

Leave a Comment