Emotional Pawan Kalyan on Ayodhya ram mandir: అయోధ్య బాలరాముడితో సెల్ఫీ .భావోద్వేగమైన పవన్ కళ్యాణ్

website 6tvnews template 75 Emotional Pawan Kalyan on Ayodhya ram mandir: అయోధ్య బాలరాముడితో సెల్ఫీ .భావోద్వేగమైన పవన్ కళ్యాణ్

Emotional Pawan Kalyan on Ayodhya ram mandir: అయోధ్య(Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు (SriRam) అయోధ్యలో కొలువుదీరాడు.

ఈ క్రతువుని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వయంగా దగ్గరుండి మరీ నిర్వహించారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు రామ మందిర నిర్మాణానికి తమ చెమటోడ్చిన కార్మికులను ప్రధాని పూలు చల్లి మరీ సన్మానించి నమస్కరించారు.

సీతా సమేత రామచంద్ర స్వామికి జై అంటూ అయోధ్య ఒక్కసారిగా భక్తిభావంతో పులకించిపోయింది. ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఉత్తర్‎ప్రదేశ్ (Utter Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adithyanath) సహా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయన నాయకులు, ప్రభుత్వ అధికారులు, భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.రాముల వారి వైభవాన్ని చూసి ఆనందంలో తేలియాడారు.

ఇక మరీ ముఖ్యంగా అయోధ్య నగరం సినీ సెలబ్రిటీల సందడితో కళకళలాడింది. రాములవారి కార్యక్రమానికి వచ్చినందకు వారు ఆనందోత్సాహంతో ఉన్నారు. అంతే కాదు 500 ఏళ్ల తరువాత హిందువుల కల నేరవేరిన ఈ అద్భుత ఘట్టంలో పాల్గొన్న ఆనందాన్ని తమ తమ ఫోన్లలో సెల్ఫీ రూపంలో భద్రపరుచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అద్భుత కార్యక్రమానికి చాలా మంది సెలబ్రిటీలు వెళ్లారు. ఆలయ ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్లిన జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రాణ ప్రతిష్టకు ముందు పవన్ కళ్యాణ్ ఇది భారతీయుడి కల అని తెలిపారు.

Pawan Kalyan’s selfie with Balaram : బాలరాముతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ

ప్రతిష్టాత్మకమైన ఈ రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలరామ(Balram) మందిరం కనిపించేలా ఓ సెల్ఫీ దిగి దానిని తన ట్విట్టర్‌లో(Twitter) షేర్ చేశారు. రామకార్యం అంటే రాజ్యకార్యం.

ప్రజాకార్యం.. జైశ్రీరామ్‌(Jai Sri Ram).. అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.

It took 500 years to bring Rama to Ayodhya : అయోధ్యకు రామయ్యను తీసుకురావడానికి 500 ఏళ్లు పట్టింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ అద్భుమైన ఘట్టాన్ని చూసి భావోద్వేగమయ్యారు.

ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. “భారతీయ నాగరికతకు రామచంద్రుడే మూలకారకుడు. రాముడిని ఆయన జన్మ స్థలమైన అయోధ్య(Ayodhya)కు తీసుకువచ్చేందుకు 500 ఏళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు ఆ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 500 ఏళ్లనాటి భారతీయుల కల నెరవేరింది.

బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సమయంలోచాలా భావోద్వేగానికి గురయ్యాను. కంటి నుంచి నీళ్లు వచ్చాయి. ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం.

భారతీయుల ఐక్యతను ఈ ఘట్టం మరోసారి రుజువుచేసింది. బలరాముడిని చూసేందుకు దక్షిణాది భక్తులు ఇకపై అయోధ్యకు చేరుకుంటారు”. అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ayodhya,ram mandir,ram temple, inauguration,chiranjeevi,pawan kalyan,pm modi,emotional post,Ram Mandir Inauguration, janasena president pawan kalyan selfi

Leave a Comment