England vs Pakistan match world cup 2023 : ఇంగ్లాండ్ vs పాక్ పాక్ పై గెలిస్తే ఇంగ్లాండ్ కి ఆ ఛాన్స్ దక్కినట్టే.
వన్ డే వరల్డ్ కప్ మొదలైన నాటి నుండి పాకిస్తాన్ దేశ ఆటగాళ్లు తీవ్ర మైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారి పేలవమైన ఆట తీరుతో చిన్న చిన్న దేశాల జట్లపై కూడా గెలిచేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్వదేశం నుండి అనేక విమర్శలు వారిపై వెల్లువెతుతున్నాయి.
మరి ఆ విమర్శలకు అడ్డుకట్ట వేయాలంటే పాకిస్తాన్ సేన ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి తీరాలి. అయితే అది సదా సీదా విజయం అయితే అస్సలు ఉపయోగం ఉండదు.
ఎదో ఒకటి రెండు రన్స్ తో గెలుచి చావుతప్పి కన్ను లొట్టపోయింది లే అన్నట్టు ఉంటె ప్రయోజనం ఉండదు. ఆ విజయం ఎలా ఉండాలి అంటే పాక్ బ్యాటింగ్ చేస్తే వందల సంఖ్యలో పరుల తేడా ఉండాలి.
అదే బౌలింగ్ చేసినా కూడా అలాగే వందల బాల్స్ మిగిలి ఉండాలి. నిర్ణీత యాభై ఓవర్లలో పాక్ మాయాజాలం చేస్తే తప్ప అగ్నిపరీక్ష నుండి బయటపడదు.
మరి పాక్ జట్టు కు అంతటి మాయాజాలం చేయగల సత్తా ఉంటె ఇంత అట్టడుగు స్థానంలో ఎందుకు ఉంటుంది అంటున్నారు క్రికెట్ నిపుణులు.
పాక్ ఆ వండర్ క్రియేట్ చేయగలదని క్రికెట్ లవర్స్ కె కాదు, పాక్ అభిమానులకు కూడా నమ్మకం ఉండదని చెప్పడంలో సందేహం లేదు. కానీ పాక్ మాత్రం ఆ రాక్షస ప్రయత్నానికి నడుం బిగించింది.
ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆ దేశానికి కూడా ఇది కీలక మ్యాచ్ గా నిలువనుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో గనుక ఓటమి పాలైతే వారికి చాంపియన్స్ ట్రోఫీ లో ఎంట్రీ ఉండదు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీ మొదలుపెట్టిన ఇంగ్లండ్ పేలవమైన ఆటతీరుతో బొక్కబోర్లా పడింది అని చెప్పొచ్చు. పాయింట్ల పట్టికలో టాప్–8లో స్థానం సంపాదించుకోవాలని ఆరాటపడుతోంది.
అందుకోసం పాక్ పై జరిగే మ్యాచ్ లో తీవ్ర మైన పోరాట పటిమ చూపెట్టాలి ఇంగ్లాండ్. పైగా శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఇంగ్లాండ్ కు గట్టి పోటీ ఉండటంతో ఈ మ్యాచ్‌లో గెలిచి బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది.
ఇక ఇంగ్లాండ్ టీమ్ కూడా ఆలిరౌండర్లతో నిండి ఉంది. ఇలాంటి జట్టు పాకిస్తాన్ ను మట్టి కరిపిస్తుందా ? పాక్ పై గెలిచి చాంపియన్స్ ట్రోఫీ లో ఎంట్రీ సాధిస్తుందా ? తెలియాలంటే వెయిట్ చేయాలి.