Etela Rajender : ఈటెలకు తప్పని ఓటమి ఎందుకు ఈ తల పోటు ?

6tv projects 16 Etela Rajender : ఈటెలకు తప్పని ఓటమి ఎందుకు ఈ తల పోటు ?

Etela Rajender : ఈటెలకు తప్పని ఓటమి ఎందుకు ఈ తల పోటు ?

పార్టీ సభ్యత్వం తోపాటు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసిన అయన మరో మారు హుజురాబాద్ లో పోటీ చేసి గెలుపొందారు. తనకు పార్టీలో గుర్తింపు దక్కడం లేదని, కష్టకాలంలో ఉద్యమ సమయం లో తనను ఉపయోగించుకుని అవసరం తీరాక విస్మరించారని అప్పట్లో ఆయన వాపోయారు.

అంతేకాక రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నిలబడే గజ్వేల్ లో కూడా తానూ పోటీ చేసి తీరుతానని ఆయను ఓడిస్తానని భీషణ ప్రతిన బూనారు. కానీ తన కలలు కల్లలయ్యాయి. కేసీఆర్ ను ఓడించడం పక్కన పెడితే, సొంత నియోజకవర్గం హుజురాబాద్ స్థానాన్ని తన చేయి దాటిపోకుండా చేసుకోలేకపోయారు.

ఈ ఎన్నికల్లో బిఆర్. ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయి పరాభవం చెందారు. అప్పట్లో హుజురాబాద్ లో తనను ఓడించేందుకు బి.ఆర్.ఏఎస్ పార్టీ అధిష్టానం హేమాహేమీలతో ప్రచారం చేయించిందని కూడా చెప్పుకొచ్చారు ఈటెల. అయితే 2021 లో జరిగిన బై ఎలెక్షన్ లో కూడా ఈటెలపై బిఆర్.ఎస్ తరుపున బరిలోకి దిగింది పాడి కౌశిక్ రెడ్డే. అప్పుడు ఓడిపోయినా కౌశిక్ రెడ్డి ఇప్పుడు గెలిచి బదులు తీర్చుకున్నట్టు చేశాడు.

ఇక హుజురాబాద్ సంగతి అటుంచితే గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించి తీరుతానని ఈటెల చెప్పారు. ఈటెల కేసీఆర్ పై పోటీ చేస్తానని చెప్పడంతో అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అయింది. ఒకప్పుడు గురు శిష్యు;లు మాదిరిగా ఉన్న ఈ ఇద్దరు ఆతరువాత ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరడం ఆశ్చ్ర్యకరంగా మారింది. మొత్తానికి ఈటెల చెప్పినట్టుగా గజ్వేల్ లో కూడా పోటీ చేశారు.

కానీ పాలిటిక్స్ లో సీనియర్ అయినా కేసీఆర్ ను అక్కడ ఓడించడం అది ఈటెల శక్తికి అలివికానిదయింది.

Leave a Comment