మోడీ సభ లో తెలుగు ట్రాన్స్ లేషన్ పై మోడీ కి కుడా నవ్వు ఆగలేదుగా !

1200 675 20989875 796 20989875 1710486732265 మోడీ సభ లో తెలుగు ట్రాన్స్ లేషన్ పై మోడీ కి కుడా నవ్వు ఆగలేదుగా !

రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారం లో భాగంగా రెండు రోజులు పర్యటన కు మోడి హైదరాబాద్ రావడం జరిగింది. నిన్న మల్కాజ్ గిరి ప్రాంతం లో రోడ్ శో పాల్గొన్న అనంతరం ఈరోజు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభలో మాట్లాడుతుండ గా ఒక ఆశ్చర్య కర సంఘటన జరిగింది.

ఆ సభ లో మోడీ మాట్లాడుతూ నా తెలంగాణా కుటుంబ సబ్యులరా మీకు నమస్కారాలు అని చెప్పగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి తెలుగు అనువాదం చెయ్యడం చెయ్యడం మొదలు పెట్టారు. అనంతరం మోడీ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడే ఉన్న అనువాదకుడు ప్రతి మాటకు అనువాదం చేసి చెప్తున్నాడు. ఆ మాటలు విన్న మోడీ ఆ అనువాదం చేసే వ్యక్తి మీద ఒక హాస్యం తో కూడిన ఒక మాట అన్నారు.

మీరు చాల బాగా తెలుగు లో ట్రాన్స్ లేట్ చేసి చెప్తున్నారు అంటూ నే మోడీ ఇలా అన్నారు ” నేను కనక మీ దగ్గర ఒక 10 రోజులు ఉంటె కచ్చితం గా స్పష్టం గా తెలుగు నేర్చేసుకుంటాను ” అని హిందీ లో అన్నారు. నేను ఇప్పడు అన్న మాటలను మీరు ట్రాన్స్ లేట్ చేసి చెప్పండి అని మోడీ అన్నారు. అప్పుడు ఆ అనువాదకుడు ఇలా చెప్పాడు ” మీ అనువాదం బాగుంది మీతో 10 రోజులు ఉండే బాగ్యం వచ్చినట్లయితే తెలుగు వస్తుంది నా జీవితం ధన్యమవుతుంది ” అని అనువాదం చేసి చెప్పడం తో సభా వేదిక మీద ఉన్న వారితో పాటు సభలో ఉన్న వారందరూ గొల్లు మని నవ్వారు.

Leave a Comment