Exchange phone offers : కొత్త ఫోన్ కోసం..పాత ఫోన్ అమ్మేస్తున్నారా?? అయితే, ఈ టిప్స్ మీ కోసమే.

6tv projects 21 Exchange phone offers : కొత్త ఫోన్ కోసం..పాత ఫోన్ అమ్మేస్తున్నారా?? అయితే, ఈ టిప్స్ మీ కోసమే.

Exchange phone offers : కొత్త ఫోన్ కోసం..పాత ఫోన్ అమ్మేస్తున్నారా?? అయితే, ఈ టిప్స్ మీ కోసమే.

ప్రపంచం రోజు రోజుకి మారిపోతోంది. డిజిటల్ ప్రపంచం జాబితాలో చేరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. అది లేకపోతే ప్రపంచమే మునిగి పోతుందా అన్న ఫీలింగ్. ఇది ఇలా ఉంటే.. ఒక గంట కరెంటు పోయినా ఉంటుందేమో నేటి యువత తనం కానీ, ఫోన్ చేతిలో లేకపోతే ఊపిరి ఆగి పోతున్నట్టుగా తయారవుతుంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా..

మార్కెట్లోకి కొద్దికొద్ది కాలంలోనే కొన్ని మార్పులు చేర్పులతో కొత్త కొత్త ఫోన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక ఫోన్ కొనగానే ఆ ఫోన్ ఇంకొక మరో కొత్త ఫోన్ ని చూసేసరికి, దానిలోని ఫీచర్స్ నచ్చే ఉన్న స్మార్ట్ ఫోన్ ని అమ్మాయిలని కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి సమయంలో మనకు అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం

ఒక స్మార్ట్ కొత్త ఫీచర్ల కోసమో, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోసమో, లేక సరదాగానో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్
ఫోన్లను కొనడం ఈ కాలం లో ఫ్యాషన్ గా మారిపోయింది. అందుకే, వారి దగ్గర ఉన్న
పాత సెకండ్ హ్యాండ్ ఫోన్ ను మార్కెట్లో అమ్మేస్తుంటారు. కానీ.. ఇలా అమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన మన పర్సనల్ డేటా ను మోసగాళ్ళ చేతిలో పెట్టినట్టే.. అన్న సంగతిని మర్చిపోతున్నారు..ఇంతకీ.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకింగ్ కు చెందిన వివరాలను, యూపీఐ యాప్స్ ను మీరు ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్లను డిలిట్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఈ యప్ లన్ని మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉంటాయి కాబట్టి. మీ ఫోన్ను కొన్న వారుదుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. వారికి ఓటీపీ తెలియకపోవచ్చు. కానీ.. యాప్లో మిగిలి ఉన్న ఏదైనా డేటాను వారు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు…కాబట్టి ఫోన్లోని అన్ని బ్యాంకింగ్, యూపీఐ యాప్లను డెలిట్ చేయడం మర్చిపోవద్దు..

కొత్త ఫోన్ ను చూసుకొని పాత ఫోన్ ను వదిలించుకోవాలనే తొందర లో ఈ సంగతి ని మర్చిపోతే.. ఇంక అంతే మరి… ఒక్కసారి ఆలోచించండి.ఇంకా మీ ఫోన్ లో
కాల్ రికార్డ్స్, మెసేజెస్లు, కాల్ రికార్డ్స్ అందులో లేకుండా చూడండి. అనవసరమైనవి అయితే మీరే డెలిట్ చేయండి. కావాలి అనుకుంటే మాత్రం.. మీ కాంటాక్ట్స్ బ్యాకప్ చేసినట్టుగానే.. వీటిని కూడా బ్యాకప్ చేసుకోని మీ మెయిల్ కి సెండ్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో మీ బంధువులతో దిగిన ఫోటోలను,
వీడియోలు డిలీట్ చేయడం మర్చిపోకండి.


ఇతర మల్టీమీడియా కంటెంట్ ఏమైనా బ్యాకప్ చేయాలనుకుంటే, క్లౌడ్ స్టోరేజీ ని ఉపయోగించి సేవ్ చేసుకోండి. గూగుల్ ఫొటోస్, గూగుల్ డిస్క్, మైక్రోసాఫ్ట్ వన్డేవ్, డ్రాప్ బాక్స్ వంటి సర్వీసులను ఉపయోగించి మళ్ళీ క్లౌడ్ బ్యాకప్ చేసుకోవచ్చు. క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ద్వారాడేటాను రీస్టోర్ చేయడం సులభంగానే ఉంటుంది.

Leave a Comment