Exciting news about Karthi Japan : కార్తీ జపాన్ సినిమా గురించి అదిరిపోయే న్యూస్..నెట్ ఫ్లిక్స్ సడన్ డెసిషన్..
సూర్య తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడ్డుపెట్టి, హీరోగా తెరపై మెరిశాడు కార్తీ, కానీ అనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తాజాగా ఈ కోలీవుడ్ హీరో నటించిన సినిమా జపాన్.
ఈ సినిమా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందింది. టీజర్లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఆడియన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. పైగా కార్తీ సినిమా కావడంతో తెలుగు ఆడియన్స్ మరింత అంచనాలను పెంచుకున్నారు.
కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నవంబర్ 10వ తేదీన విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ ఆడిపాడింది.
పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి లక్ష్మి కటాక్షం దక్కకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటిటీ ప్లాట్ ఫార్మ్ లోకి దించాలని భావిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను డిసెంబర్ 10 వ తేదీన ఓటిటీ లో స్ట్రీమింగ్ చేద్దాం అని ఫిక్స్ అయింది, కానీ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూసి అనుకున్న తేదీకన్నా ముందే ఓటిటీ ప్రియులకు అందించాలని భావిస్తోందట.
కానీ సదరు సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ప్రేక్షకులను ధియేటర్స్ కి రప్పించడంలో వెనుకబడిన ఈ సినిమా ఓటిటీ లో విడుదలైతే ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
ఇక ప్రస్తుతం కార్తీ హీరోగా నలన్ కుమారస్వామి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కార్తీ 26 వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కార్తీ సరసన కృతి శెట్టి నాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.